బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస

బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస

ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ చౌరస్తాలోని దేవుని తోట ఆలయంలో గురువారం బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస నెలకొంది. కార్యక్రమానికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్​తోపాటు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లను అధికారులు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే చేరుకొని, ఎంపీ కోసం వెయిట్ చేశారు. ఎంపీ రావడానికి లేట్ అవుతుండడంతో కొంతమందికి చెక్కులు పంపిణీ చేసి వెళ్తానని ఎమ్మెల్యే చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. 

ఎంపీ రాకముందే ఎలా పంపిణీ చేస్తారన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలోనే చెక్కులు మాయం కావడంతో ఇది పద్ధతి కాదంటూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అసహనంతో వెళ్లిపోయారు. అప్పుడే వచ్చిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.