
కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో రజిని కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘జూనియర్’. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, శుక్రవారం ట్రైలర్‌ను రాజమౌళి లాంచ్ చేశారు. కాలేజ్‌లో ఆడుతూ పాడుతూ అల్లరిచేసే అభి (కిరీటి).. క్లాస్‌మేట్ స్ఫూర్తి (శ్రీలీల)ను ప్రేమిస్తుంటాడు. ఎలాంటి బాధ్యతలు లేకుండా సాగిపోతున్న అతని జీవితం.. తన తండ్రి ఊరిలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాక ఎలాంటి మలుపు తిరిగింది.. ఇందులో బాస్ పాత్రలో జెనీలియా పాత్ర ఏమిటనేది మెయిన్ కాన్సెప్ట్.
లవ్, రొమాన్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఫాదర్ ఎమోషన్‌ను బ్లెండ్ చేసి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. కిరీటి తండ్రిగా డా. రవిచంద్ర కనిపించారు. ‘ప్రపంచంలో ప్రతి మనిషి కోపం వెనుక ఏదో కారణం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల కోపం వెనుక ప్రేమ మాత్రమే ఉంటుంది’ అంటూ కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. జులై 18న సినిమా విడుదల కానుంది.