వింటేజ్ ఎరాలో కాళిదాసు

వింటేజ్ ఎరాలో కాళిదాసు

కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కేడీ : ది డెవిల్’. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామాకు  ప్రేమ్ దర్శకుడు.  కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. రీష్మా నానయ్య హీరోయిన్.  తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ధృవ సర్జా మాట్లాడుతూ ‘ఇదొక యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. 

సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి సీనియర్లతో నటించడం ఆనందంగా ఉంది. త్వరలో విడుదలయ్యే ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు.  సంజయ్ దత్ మాట్లాడుతూ ‘ప్యాషనేట్ టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి వర్క్ చేశా. ధృవ్ ఈ చిత్రంతో మరింత ఎత్తుకు ఎదగాలిని కోరుకుంటున్నా. ప్రస్తుతం ప్రభాస్‌‌‌‌‌‌‌‌తో ‘రాజా సాబ్’ మూవీలో నటిస్తున్నా. ఆ సెట్‌‌‌‌‌‌‌‌లో తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా’ అని చెప్పారు. 

ఈ చిత్రంలో సత్యవతి పాత్రలో అందర్నీ ఆకట్టుకుంటానని శిల్పా శెట్టి చెప్పింది. ఇందులోని అన్ని పాత్రలు యూనిక్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని రీష్మా చెప్పింది. ధృవ సర్జా పోషించిన  కాళిదాసు పాత్రలో ఎంతో ఎమోషన్ ఉంటుందని  డైరెక్టర్ ప్రేమ్ తెలియజేశాడు.