ఒపెన్​హైమర్ మూవీపై వివాదం

ఒపెన్​హైమర్  మూవీపై వివాదం

న్యూఢిల్లీ: అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఒపెన్​హైమర్ బయోపిక్ ‘ఒపెన్​హైమర్’పై వివాదం నెలకొంది. ఈ సినిమాలో సెక్స్ సీన్ లో భగవద్గీతను వినిపించడంపై పలువురు మండిపడుతున్నారు. ఇది హిందువులపై జరుగుతున్న దాడి అని ఫైర్ అవుతున్నారు. అసలు ఈ సీన్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) ఎలా అనుమతించిందని ప్రశ్నిస్తున్నారు. ‘‘ఈ మూవీలో రాబర్ట్ ఒపెన్​హైమర్ (సిలియన్ మర్ఫీ) సెక్స్ చేస్తూ భగవద్గీత చదువుతున్న సీన్ ఒకటి ఉంది. అసలు దీన్ని సీబీఎఫ్ సీ ఎలా అనుమతించింది? దీనిపై ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ స్పందించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అని కేంద్ర సమాచార కమిషనర్, ‘సేవ్ కల్చర్ సేవ్ ఇండియా’ ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ మహుర్కర్ డిమాండ్ చేశారు.