బిల్కిస్ బానో కేసులో దోషి పెరోల్‌‌పై విడుదల

బిల్కిస్ బానో  కేసులో దోషి పెరోల్‌‌పై విడుదల

గాంధీనగర్: బిల్కిస్ బానో గ్యాంగ్‌‌రేప్ కేసు దోషుల్లో  ఒకరైన ప్రదీప్ మోధియాకు గుజరాత్ హైకోర్టు ఐదు రోజుల పెరోల్ ఇచ్చింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ప్రదీప్ మోధియాకు పెరోల్ మంజూరు అయినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. దాంతో అతను గోద్రా జైలు నుంచి రిలీజ్ అయ్యాడని తెలిపారు. తన మామా చనిపోయినందున 30 రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని కోరుతూ మోధియా.. జనవరి 31న గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని జస్టిస్ ఎం.ఆర్. మెంగ్డే ఈ నెల 5న విచారించారు.

పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..మోధియా గతంలో  పెరోల్‌‌పై విడుదలైనప్పుడు, సరైన సమయానికి తిరిగి వచ్చారని హైకోర్టుకు తెలిపారు. అంతే కాకుండా జైల్లో అతని ప్రవర్తన కూడా బాగుందని చెప్పారు. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ..30 రోజులకు బదులు ఐదురోజులకు పెరోల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.