ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్న వంట మనిషి

ఆర్థిక  ఇబ్బందులతో ఉరేసుకున్న వంట మనిషి

హైదరాబాద్: లాక్ డౌన్ కష్టాలు పేదలను వెంటాడుతున్నాయి. ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న పేదలు బతుకు భారమై అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి మహానగరంలోని పేట్ బషీరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యకే అన్నం పెట్టలేకపోతున్నాననే మనస్తాపంతో పి.దుర్గాప్రసాద్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
జీడిమెట్ల ప్రాంతంలో నివసిస్తతున్న పి. దుర్గా ప్రసాద్ వంట పనులు చేసుకుని జీవించేవాడు.  లాక్ డౌన్ కారణంగా చాలా కాలం పాటు ఉపాధి కోల్పోయాడు. కుటుంబం తిండి తిప్పల కోసం నానా ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. ఎక్కడా అప్పులు పుట్టక.. ఇచ్చిన వారు కూడా నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నాడు. నిన్న ఆదివారం అర్ధరాత్రి మానసికంగా తీవ్రంగా నలిగిపోయి బెడ్ రూమ్ కు గడియ వేసి..  కిటికీకి ఉన్న కాటన్ క్లాత్ తో హాల్లో  ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. ఉదయమే భార్యా పిల్లలు గది తలుపులు వేసి ఉండడం చూసి పిలిస్తే పలుకలేదు. ఫ్యాన్ కు ఉరేసుకోవడం చూసి కుప్పకూలిపోయారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.