20 నుంచి స్కూళ్లలో వంట బంద్​ చేస్తం

20 నుంచి స్కూళ్లలో వంట బంద్​ చేస్తం
  •     తహసీల్దార్లకు మిడ్​ డే మీల్స్​కార్మికుల సమ్మె నోటీసులు 

జూలూరుపాడు/పాల్వంచ రూరల్/పాల్వంచ, వెలుగు : పెండింగ్​ బిల్లులు, పెంచిన జీతాలు చెల్లించకపోతే ఈ నెల 20 నుంచి స్కూళ్లలో వంట చేయడం బంద్​చేసి సమ్మెకు దిగుతామని మధ్యాహ్న భోజన కార్మికులు తేల్చి చెప్పారు. మంగళవారం మండల అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. జూలూరుపాడు మండల మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం(ఏఐటీయూసీ) అధ్యక్షురాలు ముదిగొండ లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంఈఓను కలిసి సమ్మె నోటీస్​ఇచ్చారు. ప్రతి నెల ఐదో తేదీ లోపు బిల్లులు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందిచకపోతే వంట బంద్​చేస్తామని తేల్చి చెప్పారు.

ఆమె వెంట మధ్యాహ్నం భోజన కార్మికులు గడల మంగమ్మ, ఎన్.నిర్మల, బి.వీరి, డి.రమణ, బి.సత్యవతి, విజయనిర్మల, లక్ష్మి, నాగమణి, కృష్ణమ్మ, సోనీ, తిరుపతమ్మ ఉన్నారు. అలాగే ఏఐటీయూసీ నాయకులతో కలిసి మంగళవారం పాల్వంచ మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు తహసీల్దార్ నాగరాజును కలిసి సమ్మె నోటీస్ ​ఇచ్చారు.18వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామన్నారు.