కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా.. బాటిళ్లు.. బాటిళ్లు పట్టుకెళ్లిన జనం

కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా.. బాటిళ్లు.. బాటిళ్లు పట్టుకెళ్లిన జనం

అసలే సమ్మర్.. ఎండ మండిపోతుంది.. ఈ టైంలో రోడ్లపై తిరుగుతున్న వాళ్లే కాదు.. ఇంటి పట్టున ఉండే వాళ్లు కూడా కూల్ డ్రింగ్ తాగాలని తపిస్తారు.. ఇది కామన్.. అలాంటి కూల్ డ్రింక్స్ బాటిళ్లు.. రోడ్లపై దొరికితే ఇక ఊరికే ఉంటారా చెప్పండి జనం... కేసులు కేసులు.. కార్టూన్లు.. కార్టూన్లు పట్టుకెళ్లారు..

విజయవాడ.. మచిలీపట్నం వెళ్లే రహదారిలో కూల్ డ్రింక్స్ తీసుకెళుతున్న వ్యాన్ బోల్తా పడింది. బాటిళ్లు అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. వ్యాన్ డ్రైవర్.. అతని అసిస్టెంట్ ఇద్దరూ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. రోడ్డు బోల్తా పడటంతో.. వ్యాన్ లోని కూల్ డ్రింక్స్ అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక అటుగా వెళుతున్న వాహనదారులు, జనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వ్యాన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. 

డ్రైవర్, అసిస్టెంట్ గాయాలతోనే ఉన్నారని.. వాళ్లకు ప్రమాదం లేదని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఈ వెంటనే రోడ్డుపై పడిన కూల్ డ్రింక్స్ ను చేతికి ఎన్ని వస్తే అన్ని ఎత్తుకెళ్లారు. కూల్ డ్రింక్స్ కేసులకు కేసులను పట్టుకెళ్లారు. ఇందులో థమ్స్ అప్, ఫాంటా, కోకాకోలా, స్పైయిట్ ఉన్నాయి. ఇదే సమయంలో వ్యాన్ డ్రైవర్ వ్యాపారులకు సమాచారం ఇవ్వటంతో.. వెంటనే మరికొంత మంది సిబ్బంది వచ్చారు. రోడ్డుపై మిగిలి ఉన్న కూల్ డ్రింక్ బాటిళ్లను మరో వ్యాన్ లో తరలించారు. అప్పటికే సగానికి పైగా కూల్ డ్రింక్స్ బాటిళ్లు జనం ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు వ్యాపారులు.