Coolie vs War 2: బాక్సాఫీస్ ‘వార్’లో దూసుకెళ్తున్న ‘కూలీ’.. అడ్వాన్స్ బుకింగ్స్కే అన్ని కోట్లు రావడం ఏంది సామీ !

Coolie vs War 2: బాక్సాఫీస్ ‘వార్’లో దూసుకెళ్తున్న ‘కూలీ’.. అడ్వాన్స్ బుకింగ్స్కే అన్ని కోట్లు రావడం ఏంది సామీ !

రేపు గురువారం (ఆగస్టు 14న) సినీ ప్రేక్షకులకు పండుగనే చెప్పాలి. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలైన 'వార్ 2, కూలీ' థియేటర్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే, ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్తో ఢీ అంటే ఢీ అనేలా యుద్ధం మొదలెట్టాయి. ఇందులో ఏ సినిమా కూడా తెలుగులో డైరెక్ట్గా తెరకెక్కింది కాదు. ఒకటి హిందీ సినిమా, మరొకటి తమిళ సినిమా. అయినప్పటికీ.. తెలుగులో పీక్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓవర్సీస్లో అయితే, ఓ రేంజ్లో దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలో 'వార్ 2, కూలీ'.. ఈ రెండు సినిమాల్లో ఎవరు ముందంజలో ఉన్నారనేది? సినీ అభిమానుల్లో చర్చకు దారితీసింది. మరి ఈ సినిమాల విశేషాలు తెలుసుకుందాం.   

కూలీ:

రజినీకాంత్-నాగార్జున నటించిన ‘కూలీ’అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్మురేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓపెన్ చేసిన గంట వ్యవధిలోనే హాట్ కేకుల్లా బుక్ చేసుకున్నారు ఆడియన్స్. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ అయితే, మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కూలీ నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా అద్భుతమైన రికార్డ్ అందుకుంది. ఈ సినిమా $2 మిలియన్లకు పైగా (రూ.17కోట్లకి పైగా) ప్రీమియర్ ప్రీ సేల్స్ సాధించి, దూసుకెళ్తోంది. ఇపుడీ ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ తమిళ మూవీగా కూలీ నిలిచింది.

అలాగే, చెన్నైలో బ్లాక్ మార్కెట్ స్కాల్పర్లు టిక్కెట్లను రూ.4,500 వరకు అమ్ముతున్నారని పలు నివేదికలు కూడా చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ విరియాల్ అవుతుంది. దాదాపు రూ.375 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కూలీ, ఇప్పటికే 66% కంటే ఎక్కువ రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. 

వార్ 2:

ఎన్టీఆర్-హృతిక్ నటించిన వార్ 2 సైతం బుకింగ్స్ లో దూకుడు కొనసాగిస్తోంది. అయితే, ఈ మూవీపై మొన్న జరిపిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి టాక్ మరింత ఊపందుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇప్పటికే, రెండు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ బుకింగ్స్ అలోమోస్ట్ సేల్ అయ్యాయి.

►ALSO READ | Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసులో.. ఈడీ విచారణకు మంచు లక్ష్మీ..

కూలీ vs వార్ 2:

కూలీ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.27.01 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే, దేశవ్యాప్తంగా 10,322 షోలకు 12.24 లక్షలకి పైగా అడ్వాన్స్ టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ నేడు బుధవారం వెల్లడించింది. మరోవైపు, 'వార్ 2' సినిమా ఫస్ట్ డే ముందస్తు బుకింగ్ రూ. 9.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సాక్నిల్క్ తెలిపింది.

కూలీ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్:

తమిళం: రూ. 22.81 కోట్లు
హిందీ: రూ. 75.05 లక్షలు
తెలుగు: రూ. 3.38 కోట్లు
కన్నడ: రూ. 5.86 లక్షలు

ఇండియా మొత్తం: రూ. 27.01 కోట్లు.

వార్ 2 ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్:

హిందీ: రూ. 6.5 కోట్లు (2D, IMAX 2D, 4DX మరియు ఇతర వెర్షన్లు)
తెలుగు: రూ. 3.64 కోట్లు (2D, IMAX 2D, 4DX మరియు ఇతర వెర్షన్లు)
తమిళం: రూ. 9.49 లక్షలు

ఇండియా మొత్తం: రూ. 9.8 కోట్లు. 

'వార్ 2' కోసం, హిందీ ప్రేక్షకులు మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అక్కడ 2Dషోలకు అడ్వాన్స్ బుకింగ్స్లో 1.8 లక్షల టిక్కెట్లు అమ్ముడవ్వగా.. రూ.5.73 కోట్ల గ్రాస్‌ జరిగింది. తెలుగు వెర్షన్లో కూడా బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 1.48 లక్షల టిక్కెట్లు అమ్ముడవ్వగా రూ. 3.64 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలా.. బాక్సాఫీస్ దగ్గర కూలీ వర్సెస్ వార్ 2 వార్ యుద్ధం ఇప్పుడే మొదలైంది.