
బాలానగర్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం నందారం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా రాగి నాణేలు దొరికాయి. తహసీల్దార్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సర్వే నంబర్ 83లో లింబ్యా నాయక్‌కు చెందిన పొలంలో కొద్ది రోజులుగా ఉపాధి హామీ పథకం కింద కూలీలు కుంట పనులు చేస్తున్నారు. సోమవారం పొలంలో తవ్వుతుండగా నిజాం కాలానికి చెందిన 228 రాగి నాణేలు కనిపించాయి. విలేజ్ సెక్రెటరీ నరేశ్ విషయాన్ని తహసీల్దార్‌కు చెప్పడంతో అక్కడికి వచ్చిన ఆయన పంచనామా నిర్వహించారు. పురావస్తు శాఖ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసుల సమక్షంలో రాగి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వెంట ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.