దహెగాం లో ట్రాన్స్ ఫార్మర్ పగులగొట్టి కాపర్ వైర్ చోరీ

దహెగాం లో ట్రాన్స్ ఫార్మర్ పగులగొట్టి  కాపర్ వైర్ చోరీ

దహెగాం, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్​ఫార్మర్​ను పగులగొట్టి అందులోని కాపర్ వైర్​ చోరీ చేశారు. ఈ ఘటన దహెగాంలో జరిగింది. బాధిత రైతు చప్పిడి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం శివారులోని తన వ్యవసాయ భూమికి మంగళవారం ఉదయం వెళ్లి చూడగా తన పొలం సమీపంలో అమర్చిన ఎలక్ట్రికల్​ ట్రాన్స్​ఫార్మర్​ను కొందరు పగులగొట్టి కాపర్​వైర్​ను ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. విషయాన్ని విద్యుత్​అధికారులకు తెలియజేయగా వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.