Cyber Crime : రాజ్ కుంద్రా కేసుతో లింక్ పెట్టి.. కేటుగాళ్లు డబ్బులు వసూలు

Cyber Crime : రాజ్ కుంద్రా కేసుతో లింక్ పెట్టి.. కేటుగాళ్లు డబ్బులు వసూలు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరుతో సైబర్ మోసగాళ్లు కొత్త రకం మెసాలకు దిగుతున్నారు.   కుంద్రా ప్రమేయం ఉన్న మనీలాండరింగ్ కేసులో మీ పేర్లు ఉన్నాయంటూ  పోలీసు అధికారులుగా నటిస్తుూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.  కుంద్రా పేరును ఉపయోగించి మోసగాళ్లు డబ్బులు వసూలు చేసినట్లుగా  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.  

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసగాళ్ల ట్రాప్ లో పడకుడదని చెబుతున్నారు.  సికింద్రాబాద్‌కు చెందిన 80 ఏళ్ల వ్యక్తి కుంద్రాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడని మోసగాళ్లు కాల్ చేసి బెదిరించి రూ.15.86 లక్షలు మోసం చేశారు. ముంబయిలోని అంధేరీ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా ఫోన్‌ చేసిన నేరగాళ్లు  కేసు సీరియస్‌గా ఉందని చెప్పాడు. ఆ వివరాలను సీబీఐకి అందజేస్తానని బెదిరించాడు. 

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు చేస్తామని బెదిరించాడు. తన భార్య నగలు, ఇంటితో సహా తన ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటానని, తన పిల్లలను ఇరికిస్తానని బెదిరించాడు. సికింద్రాబాద్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి మొదట టెలికాం డిపార్ట్‌మెంట్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. కుంద్రా కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన ఆధార్ కార్డు వివరాలు ఉన్నాయంటూ బాధితుడిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశాడు.  తాము మోసపోయినని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.