బషీరాబాద్ పోలీసు స్టేషన్లోకి నాగుపాము...

బషీరాబాద్ పోలీసు స్టేషన్లోకి నాగుపాము...

నాగుపాము పోలీస్ స్టేషన్లో హల్ చల్ చేసింది. సడెన్ ఎంట్రీ ఇచ్చి పోలీసులను భయబ్రాంతులకు గురి చేసింది. ఒక్కసారిగా నాగు పాము బుసలు కొడుతూ రావడంతో ఎస్సైతో సహా కానిస్టేబుళ్లు అంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. 

బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నాగుపాము కలకలం సృష్టించింది. అకస్మాత్తుగా  బాత్రూం దగ్గర నాగు పాము బుసలు కొట్టడంతో సిబ్బంది అంతా భయపడ్డారు. అయితే స్నేక్ క్యాచర్ ప్రదీప్కు పోలీసులు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన  ఆ యువకుడు కర్ర సహాయంతో పాముని పట్టుకొని ఊరు చివర వదిలిపెట్టాడు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  అయితే పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో పాత భవనాలు ఉండడంతో అక్కడ పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయని స్థానికులు తెలిపారు.