కరోనా పంజా..జిల్లాలూ డేంజర్ లోనే…

కరోనా పంజా..జిల్లాలూ డేంజర్ లోనే…

హైదరాబాద్, వెలుగుఇప్పటివరకు హైదరాబాద్‌‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలపైనే పడగ విప్పిన కరోనా ఇప్పుడు జిల్లాలకూ అంటుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ప్రాంతాన్నీ ఆగం చేస్తోంది. వారం ముందు వరకు పెద్దగా కేసుల్లేని జిల్లాలలో ఇప్పుడు పదుల సంఖ్యలో బయపడుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా పరిస్థితి మరింత తీవ్రమైంది. అన్ని జిల్లాల్లో కలిపి గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌కు మించి కేసులు రికార్డయ్యాయి. లక్షణాలున్నోళ్లు జిల్లాల్లో శాంపిల్స్‌‌ ఇస్తే అవి సిటీకి చేరి టెస్టులు పూర్తయ్యేసరికి నాలుగైదు రోజులు పడుతోంది. ఈ లోపు ఇంకింత మందికి వైరస్‌‌ సుట్టుకుంటోంది. రోగం ఎవరి నుంచి, ఎట్ల సోకిందోనని జనం ఆగమైతుంటే సర్కారు మాత్రం సింప్టమ్స్‌‌ ఉన్నోళ్లకు టెస్టులు చేయట్లేదు.

కోటిన్నర మంది ఉంటున్న హైదరాబాద్‌లో వారం కిందటి వరకు జిల్లాలన్నింటి కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసుల్లో 90 శాతం గ్రేటర్‌ హైదరాబాద్​ పరిధిలోనే ఉండేవి. మిగిలిన రాష్ర్టమంతా కలిపి 10 శాతం నమోదయ్యేవి. కానీ మూడ్రోజులుగా గ్రేటర్‌లో కన్నా జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గురువారం నాడు అన్ని జిల్లాల్లో కలిపి గ్రేటర్‌ కన్నా 100 ఎక్కువ కేసులు రికార్డయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 3 రోజుల్లోనే 200 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 92 మందికి వైరస్‌ సోకింది. నల్గొండ జిల్లాలో 64, సంగారెడ్డిలో 57, వనపర్తిలో 51, వరంగల్ అర్బన్ 47, నాగర్‌ కర్నూల్ 30, మెదక్ 26, సూర్యాపేట 20, నిజామాబాద్‌లో 20 కొత్త కేసులొచ్చాయి. జిల్లాల్లోనూ అర్బన్ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా కేసులు నమోదవుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ట్రీట్‌మెంట్ సదుపాయాలు లేకపోవడంతో టెన్షన్‌ పడుతున్నారు.

ఊర్లకు ఎవరొస్తున్నరో రికార్డు చేస్తలె

లాక్‌డౌన్ టైమ్‌లో, ఆ తర్వాత కొన్ని రోజుల వరకు నగరాలు, పట్టణాల నుంచి కొత్తగా ఎవరు ఊర్లకు వెళ్లినా ఆ వివరాలను పక్కాగా రికార్డు చేశారు. కొన్ని ఊర్లలో పంచాయతీలు చొరవ తీసుకుని కొత్తగా ఊర్లోకి వచ్చిన వాళ్లను వారం రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని నేరుగా కలిసిన వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆశ వర్కర్లు, లోకల్ హెల్త్ స్టాఫ్‌ అవగాహన కల్పించారు. కానీ దాదాపు నెలన్నరగా ఇలాంటి జాగ్రత్తలేవీ ఉండట్లేదు. హెల్త్ డిపార్ట్‌మెంట్, పంచాయతీలు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో కొత్తగా వైరస్ సోకిన వారిలో తీవ్రత పెరిగాకే విషయం బయటకు తెలుస్తోంది. అప్పుడు వాళ్లకు ట్రీట్‌మెంట్​అందడం కష్టమవుతోంది. అసలు వైరస్‌ ఎవరి నుంచి ఎవరికి, ఎలా వైరస్​సోకిందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

సాగు ఊపందుకున్న టైమ్‌లో..

సిటీలు, టౌన్లల్లో కరోనా వ్యాప్తికి అవకాశం ఎక్కువుంటుందని, ఊర్లల్లో ఆ ప్రాబ్లమ్‌ తక్కువనే ధీమా ఇప్పటి వరకు ఉండేది. అందుకే సిటీల్లో పరిశ్రమలు, నిర్మాణాలు, ఇతర రంగాల్లో పనులు ఆగినా ఊర్లల్లో వ్యవసాయం, ఇతర పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజులుగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరి నాట్ల పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఊర్లల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘మందు బస్తాలకు, డీజిల్‌కు దాదాపు రోజూ మండల కేంద్రానికి పోయేటోళ్లం. కానీ మొన్ననే మండల్ల కేంద్రంలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. అటువైపు పోవాలంటే భయమేస్తోంది. వరి నాట్లకు పొరుగూరు నుంచి కూలీలు వచ్చే వాళ్లు. ఇప్పుడు మా ఊరి వాళ్లనే పిలుస్తున్నం. డిమాండ్​ ఉండటంతో నాట్లు లేటవుతున్నయ్‌’ అని జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌కు చెందిన రాజవీరు చెప్పారు.

మూడ్రోజులుగా జిల్లాల్లో కేసుల తీరిది 

రాష్ట్రంలో ఈ నెల 14న 11,651 టెస్టులు చేశారు. 1,524 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. వీరిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వాళ్లు 815 మంది ఉండగా మిగతా 709 మంది వివిధ జిల్లాలకు చెందినవారు. 15న 13,642 టెస్టులు చేస్తే 1,597 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 796 కేసులు గ్రేటర్‌లో నమోదవగా సిటీ కన్నా ఎక్కువగా 801 కేసులు జిల్లాల్లో రికార్డయ్యాయి. 16న 14,027 టెస్టులు చేయగా 1,676 మందికి పాజిటివ్ తేలింది. ఇందులో గ్రేటర్ పరిధిలో 788 మందికి, జిల్లాల్లో 888 మందికి వైరస్‌ సోకింది.

రిజల్ట్స్‌‌ లేట్‌‌.. ఆలోపే ఇంకింత మంది

రాష్ట్రంలో కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఇప్పటికీ కష్టమైన వ్యవహారమే. టెస్టుల కోసం పోతే శాంపిల్స్ ఎప్పటికి తీసుకుంటారో తెలియని పరిస్థితి. హైదరాబాద్‌‌లో శాంపిల్స్ ఇచ్చేందుకు పొద్దున 4 గంటలకే వెళ్లి ల్యాబ్‌‌ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నమైతే గాని లైన్‌‌లో ఉన్నోళ్ల వంతు రావట్లేదు. ఇక రిజల్ట్​కోసమైతే ఒక రోజు ఆగాల్సిందే. చాలా మందికి రెండు మూడు రోజులు పడుతోంది. జిల్లాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్​లో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన ల్యాబ్‌‌లలో శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం హైదరాబాద్ పంపుతున్నారు. ఈ రిజల్ట్స్​ ​వచ్చేసరికి ఒక్కోసారి ఐదు రోజులు పడుతోంది. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో ఇటీవల కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌‌ సోకిన వ్యక్తి ముంబై నుంచి వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఆయన టెస్టు రిజల్ట్ వచ్చేలోపే మరో ఆరుగురికి వైరస్‌‌ సోకింది.

తెలంగాణలో పరిస్థితి మరీ అంత భయంకరంగా లేదు