
భారతదేశంలో ముఖ్యంగా ప్రముఖ నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ మెల్లిమెల్లిగా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చడానికి చాల హై-ఎండ్ హోమ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. అయితే, దేశంలోని అధిక జనాభా, పట్టణలకి వచ్చే వలసలు, లక్షలాది మంది భారతీయులకు అందుబాటు ధరకే ఇల్లు ఇప్పటికీ ఒక పెద్ద అవసరంగా ఉన్నాయి.
మనదేశంలో అందుబాటు ధరల ఇళ్లకు అతిపెద్ద అడ్డంకి డెవలపర్లు లేదా నిర్మాణ ఖర్చులు కాదు, ప్రభుత్వమే అని టాటా రియాలిటీ MD & CEO సంజయ్ దత్ అన్నారు. సంజయ్ దత్ మాట్లాడుతూ ఒక ఆస్తి ఖర్చులో దాదాపు 50% నేరుగా ప్రభుత్వ పన్నులు, ఛార్జీలకు వెళుతుందని, దీనివల్ల ఇళ్ల ధరలు పెరిగి సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదని అన్నారు.
ఇంటి నిర్మాణంపై GST కేవలం 1%, ఇతర నివాస ఆస్తులపై 5% ఉన్నప్పటికీ స్టాంప్ డ్యూటీ (5–8%), రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మునిసిపల్ ఫీజులు, అభివృద్ధి సెస్‌లు, మరో అంతస్తు కట్టడానికి ప్రీమియంలను కూడా ఇవన్నీ కనిపించకపోయిన చెల్లించాల్సి ఉంటుంది. భూమి ప్రీమియంలు, ఆమోదాలు, మౌలిక సదుపాయాల ఛార్జీలు కూడా కలిపిన తర్వాత పట్టణలో ప్రభుత్వ వాటా ప్రాజెక్టు ఖర్చులలో 30–50% వరకు పెరుగుతుందని పరిశ్రమ అంచనాలు తేల్చాయి.
మెట్రో నగరాల్లో ఇంటి ఖర్చులలో భూమి ధర 50–85% వరకు ఉందని దత్ అన్నారు. రైల్వేలు, రక్షణ, పోర్ట్ ట్రస్టులు, మునిసిపల్ కార్పొరేషన్లు వంటి ప్రభుత్వ సంస్థల వద్ద ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించని భూమిని ఇంకా చాల ఉందని, దాని అన్‌లాక్ చేయాలనీ అన్నారు. అందుబాటు ధరకే ఇళ్ల భూమి ధర చౌకగా చేయాలి, అలాగే ప్రైవేట్ డెవలపర్లు పన్ను ప్రయోజనాల కింద ఇల్లు నిర్మించడానికి అనుమతించాలి అని అన్నారు.
కానీ అధిక పన్నులు, ఖరీదైన భూమి ధర మాత్రమే సమస్యలు కాదు. ఇల్లు కట్టడానికి ఇంటి రుణాలు కూడా ఖర్చుతో కూడుకున్నవి. ప్రజలు రాకపోకలు సాగించలేనప్పుడు సిటీ నుండి 50 కి.మీ దూరంలో ఇల్లు కట్టుకోవడంలో అర్థం ఏంటి ? అని ప్రశ్నించారు.
డెవలపర్లకు పన్ను ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పెట్టుబడి అనేది ఖరీదైనది. భూమి కొరత, పట్టణ రవాణా లేకపోవడం, సరిపోని రోడ్లు ఫలితంగా అందుబాటు ధరకు గృహ పథకాలు నిలిచిపోతాయి లేదా ప్రజలు పనిచేసే ప్రదేశం నుండి దూరంగా ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది.
ఇళ్ల కొనుగోలుదారులు వల్ల ఆస్తి విలువలో దాదాపు సగం ప్రభుత్వ పనునులు, చార్జీలకే చెల్లిస్తున్నారు. మరోవైపు డెవలపర్లకు భూమి, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి. సంజయ్ దత్ ప్రకారం భూమి లభ్యత పెంచి, పన్నులు తగ్గిస్తేనే అందరికీ అందుబాటు ధరలో ఇళ్ళు దొరుకుతాయి అని అన్నారు.