బల్దియాకు కరోనా టెన్షన్‌‌‌‌‌‌‌‌

బల్దియాకు కరోనా టెన్షన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : పోలీసులు, హెల్త్‌‌‌‌‌‌‌‌  సిబ్బందినే కాదు బల్దియా కార్మికులనూ కరోనా వదలట్లేదు. ఇప్పటికే  ముగ్గురు శానిటేషన్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి పాజిటివ్‌‌‌‌‌‌‌‌ రాగా.. తాజాగా బిల్ కలెక్టర్  కు వైరస్‌‌‌‌‌‌‌‌ సోకింది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ అమలు, కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ జోన్ల నిర్వహణలో జీహెచ్ఎంసీ సిబ్బంది  కీలకంగా ఉంటూ డ్యూటీలు  చేస్తున్నారు. వైరస్‌‌‌‌‌‌‌‌ కట్టడిలో ముందుండి పోరాడుతున్న వీరిలో లక్షణాలు బయటపడుతుండడంతో తోటి సిబ్బందికి టెన్షన్‌‌‌‌‌‌‌‌ పట్టుకుంది.   ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ సిబ్బందిలో పలువురికి కరోనా సోకడంపై అధికారుల్లో చర్చనీయాంశమైంది.

కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో డ్యూటీ చేస్తూ..

గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో కేసులు  పెరుగుతుండగా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులు, సిబ్బంది కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ పరిధిలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌ కార్మికుడు కరోనాతో మృతిచెందాడు. మే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌లో లంగర్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌కు చెందిన శానిటేషన్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ వైజర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ ఐడీహెచ్‌‌‌‌‌‌‌‌ కాలనీకి చెందిన శానిటేషన్‌‌‌‌‌‌‌‌ కార్మికుడికీ వైరస్ సోకింది.  తాజాగా శనివారం నమోదైన కేసుల్లో బిల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. మలక్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌కు చెందిన అతను కంటైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ జోన్లలో డ్యూటీ చేశాడు. గత నెలాఖరులో ప్రాపర్టీ  ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వసూలు చేసి ప్రస్తుతం కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో డ్యూటీ చేస్తున్నాడు. 2 ప్రాంతాల్లోని కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లను గుర్తిస్తున్నట్టు అధికారులు చెప్పారు.

జోన్ల నిర్వహణ బాధ్యతలతోనే..

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదైన చోట హోం కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. బిల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌లు, సూపర్‌‌‌‌‌‌‌‌ వైజర్లు, శానిటేషన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. నిత్యావసరాలను   శానిటేషన్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది అందిస్తున్నారు. ఎంటమాలజీ సిబ్బంది రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. వైరస్‌‌‌‌‌‌‌‌ ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటీలు చేస్తుండటంతో  వైరస్‌‌‌‌‌‌‌‌ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది.

ఆధార్ కార్డు తెస్తేనే యాదాద్రి దర్శనం