మూడు నెలల తర్వాత 50 వేల దిగువకు కరోనా కేసులు

మూడు నెలల తర్వాత 50 వేల దిగువకు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మరింత దిగువకు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,640 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మూడు నెలల తర్వాత కరోనా కేసులు 50 వేల దిగువకు వచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 99 లక్షల 77 వేల 861కి పెరిగింది. ఇక నిన్న కరోనా కారణంగా 1167 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3 లక్షల 89 వేల 302కు చేరింది. ఇక ఇప్పటి వరకూ కరోనా నుంచి 2 కోట్ల 89 లక్షల 26 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 లక్షల 62 వేలుగా ఉంది.

దేశంలో ఇప్పటివరకూ 28 కోట్ల 87 లక్షల 66 వేల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా.. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 86 లక్షల 16 వేలకు పైగా డోసులు పంపిణీ చేశారు. ఒక్కరోజులో వ్యాక్సినేషన్ పరంగా ఇది వరల్డ్ రికార్డు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటివరకూ దేశంలో 39 కోట్ల 40 లక్షల 72 వేల శాంపిల్స్ టెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. నిన్న 16 లక్షల 64 వేల శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.