అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. చైనాలో మొదలైన కరోనా.. మెల్లగా అమెరికాను తాకిన తర్వాత ఒక్కసారిగా అక్కడ కేసులు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట్లో కరోనా తీవ్రతను అంతగా పట్టించుకోలేదు. దాదాపు అన్ని దేశాలు కరోనాకు భయపడి లాక్డౌన్ ప్రకటిస్తే.. ట్రంప్ మాత్రం లాక్డౌన్ వల్ల దేశానికి ఆర్థికంగా నష్టమని భావించి.. లాక్డౌన్ అమలు చేయలేదు. దాంతో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

తాజాగా జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం.. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. అక్కడ 17,45,803 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 4,90,130 కేసులు రికవరీ కాగా.. 11,53,566 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 1,02,107గా ఉంది. అక్కడ (1,58,75,473)కోటి యాభైఎనిమిది లక్షల డెబ్బై ఐదువేల నాలుగు వందల డెబ్బై మూడు మందికి కరోనా టెస్టులు చేశారు.

For More News..

ఈ నెల కూడా సగం జీతాలే..