విమాన సంస్థలపై  కోలుకోలేని దెబ్బ

విమాన సంస్థలపై  కోలుకోలేని దెబ్బ

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: కరోనా సంక్షోభం వలన ఎక్కువగా నష్టపోయిన సెక్టార్లలో ఏవియేషన్ ముందుంటుంది. కరోనా ఫస్ట్‌‌‌‌వేవ్‌‌‌‌ నుంచి కోలుకుంటున్న టైమ్‌‌‌‌లో ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై సెకండ్ వేవ్‌‌‌‌ కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఒక నెలలో ప్యాసెంజర్ల సంఖ్య కనీసం మూడు సార్లయినా  రోజుకి 3.5 లక్షలను దాటితే,  ఫుల్‌‌‌‌ కెపాసిటీతో విమాన సర్వీస్‌‌‌‌లకు అనుమతివ్వడంపై ఆలోచిస్తామని  ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఒక్కసారి కూడా రోజుకి ప్యాసెంజర్ల సంఖ్య 3 లక్షలను క్రాస్ చేయలేదు. ఏప్రిల్‌‌‌‌లో అయితే ఈ సంఖ్య మరింతగా తగ్గింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి కీలకమైన సిటీలకు వెళ్లే రూట్లలో ట్రాఫిక్‌‌‌‌ భారీగా తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ ప్రారంభంలో ప్యాసెంజర్ల సంఖ్య రోజుకి 2.75 లక్షలుగా ఉందని ఇంటర్నేషనల్‌‌‌‌ కన్సల్టింగ్‌‌‌‌ కంపెనీ ఐసీఎఫ్‌‌‌‌ పేర్కొంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ సంఖ్య లక్షకు పడిపోయిందని తెలిపింది. దేశంలో కరోనా కేసులు 394 శాతం వరకు పెరిగాయి.  దీంతో విమానాల్లో ప్రయాణించేవారు సగానికి పైగా తగ్గిపోయారు. మరోవైపు ట్రాఫిక్ భారీగా పడినప్పటికీ, ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు మాత్రం తమ సర్వీస్‌‌‌‌లను అంతే వేగంగా తగ్గించుకోలేకపోయాయి. దీంతో కంపెనీలు మరింతగా నష్టపోతున్నాయి. విమాన ప్రయాణికులు తగ్గినప్పటికీ ఫ్లయిట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు కేవలం 35 శాతం మాత్రమే తగ్గాయని ఐసీఎఫ్​ పేర్కొంది. 
ఈ రూట్లలో ట్రాఫిక్ పడింది..
కరోనా వలన ముంబై–ఢిల్లీ రూట్‌‌‌‌లో ట్రాఫిక్ భారీగా తగ్గిందని ఐసీఎఫ్‌‌‌‌ డేటా చెబుతోంది. కిందటి నెలలో ఈ రూట్‌‌‌‌లో 1,656 ఫ్లయిట్ సర్వీస్‌‌‌‌లు జరిగాయి. ఈ రూట్‌‌‌‌లో తిరిగే ఫ్లయిట్స్‌‌‌‌ సంఖ్య ఏప్రిల్ చివరి నాటికి 77 నుంచి 34 కు తగ్గాయి.  ఢిల్లీ  నుంచి బెంగళూరు, శ్రీనగర్‌‌‌‌‌‌‌‌, కోల్‌‌‌‌కతా, పాట్నాలకు వెళ్లే రూట్లలో ఫ్లయిట్ సర్వీసులు భారీగా తగ్గాయి. టూర్ల కోసం ట్రావెల్‌‌‌‌ చేసేవాళ్లు ఎక్కువగా తగ్గారు. చాలా రాష్ట్రాలు కరోనా టెస్ట్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌టీ–పీసీఆర్ నెగెటివ్‌‌‌‌ చూపిస్తే తప్ప ప్యాసెంజర్లను అనుమతివ్వడం లేదు.  పోర్టుబ్లెయిర్‌‌‌‌‌‌‌‌, గోవా, శ్రీనగర్‌‌‌‌‌‌‌‌ వంటి టూరిస్ట్ ప్లేస్‌‌‌‌లకు వచ్చే రూట్లలో ఎయిర్‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్ ఎక్కువగా పడింది.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సిటీల మధ్య తిరిగే ఫ్లయిట్స్‌‌‌‌ కూడా తగ్గాయి.  కిందటి నెల ప్రారంభంలో దేశంలోని వివిధ సిటీల నుంచి గోవా మధ్య తిరిగే ఫ్లయిట్స్‌‌‌‌ 156 ఉండగా, ఏప్రిల్‌‌‌‌ 30 నాటికి ఇవి 50 కి తగ్గాయి. ఇది 68 శాతం తగ్గుదల. హుబ్లీ, జైపూర్‌‌‌‌‌‌‌‌, లక్నో, నాగ్‌‌‌‌పుర్‌‌‌‌‌‌‌‌, కన్నూర్‌‌‌‌‌‌‌‌, అమృత్‌‌‌‌సర్‌‌‌‌‌‌‌‌, పుణె, అహ్మదాబాద్‌‌‌‌ల నుంచి గోవా మధ్య తిరిగే ఫ్లయిట్లు ఆగిపోయాయి. ఢిల్లీ నుంచి గోవాకు ముందు 40 ఫ్లయిట్లు తిరగగా, ప్రస్తుతం ఇవి  7 కి తగ్గాయి. పోర్టుబ్లెయిర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ఎయిర్ రూట్లలో ట్రాఫిక్ బాగా తగ్గింది. ముంబై, ఢిల్లీ, చెన్నై నుంచి ఈ సిటీకి మధ్య తిరిగే ఫ్లయిట్లలో సగానికి పైగా ఆగిపోయాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలకు ఏప్రిల్‌‌‌‌ నెల కష్టంగా మారింది. మే నెల మరింత కష్టంగా ఉంటుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ప్యాసెంజర్ల సంఖ్య రోజుకి లక్ష కిందకు పడుతోంది. ఫ్లయిట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు కూడా 1000 కిందకు పడిపోయాయి. ఏడాది కిందట ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ ఇండస్ట్రీ ఏ పొజిషన్‌‌‌‌లో ఉందో ఇప్పుడూ అదే పొజిషన్‌‌‌‌లో ఉంది. ఇండిగో  క్వాలిఫైడ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల ద్వారా డబ్బులు సేకరించాలని చూస్తుండగా, గో ఫస్ట్ ఐపీఓ ద్వారా ఫండ్స్ సేకరించనుంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌ఎషియా తమ ఆపరేషన్స్‌‌‌‌ను తగ్గించేయగా, విస్తారా బిజినెస్‌ను విస్తరించాలనుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులను అధిగమించాలని స్పైస్‌జెట్‌  ప్లాన్స్ వేస్తోంది. 
కంపెనీలపై కరోనా పంజా.. 
ఐపీఓకి రావాలనుకుంటున్న గో ఫస్ట్‌‌, టాటా కంపెనీ ఎయిర్‌‌‌‌ఏషియాలు మార్కెట్లో మారిన పరిస్థితులకు తొందరగా రియాక్ట్ అయ్యాయి. కిందటి నెల ప్రారంభంలో గో ఫస్ట్ సర్వీస్‌‌లు రోజుకి 201 గా ఉండగా,  30 నాటికి 77 కు తగ్గాయి. అదే ఎయిర్‌‌‌‌ఏషియా సర్వీస్‌‌లు  161 నుంచి 55 కు తగ్గాయి. ఇండిగో సర్వీస్‌‌లు మాత్రం అంతే వేగంగా తగ్గలేదని చెప్పాలి.  కిందటి నెల 30 నాటికి 883 ఫ్లయిట్ సర్వీస్‌‌లను ఇండిగో ఆపరేట్ చేసింది. మొత్తం నెలలో 31,516 సర్వీస్‌‌లను జరిపింది. కంపెనీ మొత్తం సర్వీస్‌‌లు ఏప్రిల్‌‌లో కేవలం 28 శాతం మాత్రమే తగ్గాయి. కిందటి నెలలో జరిగిన మొత్తం ఫ్లయిట్ సర్వీస్‌‌లలో సగం వాటా ఇండిగోదే ఉందని ఐసీఎఫ్ పేర్కొంది. ప్రభుత్వ కంపెనీ ఎయిర్‌‌‌‌ ఇండియా సర్వీస్‌‌లు కేవలం 11 శాతం తగ్గాయి. ఈ కంపెనీ సబ్సిడరీ  అలియన్స్‌‌ ఎయిర్‌‌‌‌ సర్వీస్‌‌లు 25 శాతం మేర తగ్గాయి. హైదరాబాద్‌‌ కంపెనీ ట్రూజెట్‌‌ సర్వీస్‌‌లు 11 శాతం మేర తగ్గాయి. కాగా, రీజినల్ కనెక్టివిటీ స్కీమ్‌‌ (ఆర్‌‌‌‌సీఎస్‌‌)– ఉడాన్‌‌ రూట్లలో అలియన్స్ ఎయిర్‌‌‌‌, ట్రూజెట్‌‌ల సర్వీస్‌‌లు ఎక్కువగా ఉన్నాయి. ఈ కంపెనీ ప్రభుత్వం అందించే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సాయపడుతుందని చెప్పొచ్చు. ఏప్రిల్‌‌ 1-30 మధ్య స్పైస్‌‌జెట్ సర్వీస్‌‌లు 47 శాతం మేర, విస్తారా సర్వీస్‌‌లు 46 శాతం మేర తగ్గాయి.