ముంబైలో మరో 5500 కొత్త బెడ్లు సిద్ధం 

 ముంబైలో మరో 5500 కొత్త బెడ్లు సిద్ధం 

ముంబై: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మరో 5500 కొత్త పడకలను సిద్ధం చేసింది సర్కార్. కరోనాను కంట్రోల్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయిన ముంబై నగరపాలక సంస్థ కమిషనర్ ఇక్బాల్ సింగ్ వ్యూహాత్మకంగా పకడ్బందీ చర్యల్లో భాగంగా బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 5500 కొత్త పడకలు సిద్ధం చేయడమే కాదు.. నెలాఖరులోగా మరో 8వేల కొత్త పడకలను, అత్యవసర సేవల కోసం ఐసీయూ సేవలతో కూడిన పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు. కరోనా కట్టడిలో ముంబై నగరపాలక సంస్థ కమిషనర్ చర్యలు భేషుగ్గా ఉన్నాయని.. ముంబైని రోల్ మాడల్ గా చేసుకుని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు పరిశీలించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన నేపధ్యంలో ముంబైలో చర్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతతో పనిచేసేలా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి అమలు చేస్తున్న తీరును పలు రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా.. చికిత్సల విషయంలో చేతులెత్తేస్తున్న రాష్ట్రాల అధికారులు ముంబైలో చర్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.