రాష్ట్రం లాక్ డౌన్: రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు నో ప్రాబ్లమ్

రాష్ట్రం లాక్ డౌన్: రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు నో ప్రాబ్లమ్

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు సమస్య లేకుండా చూస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌లను ఆదేశించారు. ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్‌లు, మార్కెట్ కమిటీల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
లక్ష టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎఫ్‌సిఐ సిద్ధంగా ఉందని అన్నారు సీఎం కేసీఆర్. దీనిపై సోమవారం అత్యవసర సమీక్ష నిర్వహించి విధివిధానాలు రూపొందించాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చారు.