కరోనా అలర్ట్.. రాష్ట్ర సరిహద్దుల్లో హైవేలపై చెక్ పోస్టులు: సీఎం కేసీఆర్

కరోనా అలర్ట్.. రాష్ట్ర సరిహద్దుల్లో హైవేలపై చెక్ పోస్టులు: సీఎం కేసీఆర్
  • పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల చెకింగ్

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు సీఎం కేసీఆర్. మనకేం అవుతుందిలే అని ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ప్రజలంతా సొంతంగా జాగ్రత్తలు పాటించాన్నారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు వారంతట వారే వైద్య అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన కొందరు ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగి రైలులో రామగుండం వచ్చి కరీంనగర్ వెళ్లారని, ఇలా పది మంది వస్తే వారిలో 8 మందికి కరోనా ఉన్నట్లు నిన్న తేలిందని చెప్పారు. ఒక్క రోజులో ఇలా ఇన్ని కేసులు నమోదు కావడంపై గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో హైలెవల్ సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 14కు చేరినట్లు తెలిపారు. ఇందులో అందరూ విదేశాల నుంచి వచ్చిన వారేనని, తెలంగాణలో నివసిస్తున్న వారికి ఒక్కరికి కూడా వైరస్ సోకలేదని చెప్పారు.

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు…

ఇప్పటి వరకు నమోదైన 14 కరోనా కేసుల్లో ఐదుగురు మాత్రమే శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వారని, మిగతా 9 మంది ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో దిగి రైళ్లు, బస్సుల ద్వారా తెలంగాణలోకి వచ్చిన వారేనని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు కూడా ఢిల్లీ విమానాశ్రయంలో దిగి రాష్ట్రానికి వచ్చారన్నారు. ఇలా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవారిని గుర్తించేందుకు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో నేషనల్, స్టేట్ హైవేలపై చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు కేసీఆర్. రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు స్క్రీనింగ్ చేసి.. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్లను గుర్తించి హోం క్వారంటైన్ కు చేస్తామన్నారు. వారిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఎవరికైనా సరే కరోనా లక్షణాలు ఉంటే అవసరాన్ని బట్టి హాస్పిటల్ కు పంపి చికిత్స అందిస్తామన్నారు సీఎం. ప్రజలంతా వారంతట వారే స్వీయ నియంత్రణ పాటించాలని, నిర్లక్ష్యం వహించకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకున్న వారిమవుతామని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని కోరారు.

చెక్ పోస్టులు ఇవీ..