ఈ ఏడాది ఒక్క అడుగుతోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాటు!

ఈ ఏడాది ఒక్క అడుగుతోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాటు!

హైదరాబాద్: కరోనా ప్రభావం ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికీ తగిలింది. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఒక్క‌ అడుగులోనే వినాయకుని విగ్రహం పెట్టాలని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. ముందుగా 66 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకున్న కమిటీ.. ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఒక్క అడుగు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగిరి సుదర్శన్ తెలిపారు. ఈ సారి కర్ర పూజ కూడా ఉండదని చెప్పారు. ఆగస్టు నాటికి కరోనాకు వ్యాక్సిన్ వస్తే పది రోజుల్లో తాము అనుకుంటున్న 66 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టింప చేస్తామని క‌మిటీ నిర్వాహ‌కులు చెప్పారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహం గా ఖైర‌తాబాద్ గ‌ణ‌నాయ‌కునికి ఏంతో పేరుంది. అత్యంత వైభవం గా ఇక్కడ వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో వేడుకలను కూడా ఘనం గా నిర్వహించ వద్దు అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది