కరోనా దెబ్బకు భారీగా పెరిగిన ఇన్సూరెన్సు పాలసీలు

కరోనా దెబ్బకు భారీగా పెరిగిన ఇన్సూరెన్సు పాలసీలు

సగానికిపైగా కోటి రూపాయల పాలసీలే

ఇన్సూరెన్స్​లో రంగంలో కొత్త ట్రెండ్

పాలసీబజార్ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారితో ఇన్సూరెన్స్‌‌లపై అవేర్‌‌‌‌నెస్ పెరిగింది. ఏప్రిల్–ఆగస్ట్ మధ్య కాలంలో 50 శాతం టర్మ్ పాలసీ బయ్యర్లు రూ.కోటి లేదా కోటి రూపాయలకు పైగా కవర్‌‌‌‌ను ఎంపిక చేసుకున్నట్టు ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పాలసీబజార్ తెలిపింది. తమ ఫ్యామిలీస్‌‌ను ఫైనాన్షి యల్‌‌గా కాపాడేందుకు ఈ పాలసీలను తీసుకున్నట్టు పేర్కొంది. కోటి రూపాయల టర్మ్ కవర్‌‌ తీసుకున్న వారి డేటాను లెక్కిస్తే.. 50 శాతానికి పైగా కస్టమర్లు కోటి రూపాయలు లేదా ఆపై టర్మ్ పాలసీలను కొనుగోలు చేసినట్టు తేలింది. అఫర్డబుల్ ధరల్లో(నెలకు రూ. వెయ్యి) అందుబాటులో ఉన్న కవర్ పాలసీలపై ప్రజలు ఇన్వెస్ట్ చేయడం పెరిగిందని పాలసీబజార్ తెలిపింది. దేశంలో అమ్ము డుపోయే ప్రతి నాలుగు టర్మ్ పాలసీల్లో ఒకటి పాలసీబజార్ విక్రయిస్తోంది. కరోనా మహమ్మారితో, ప్రజలు ఇన్సూరె న్స్ కవరేజ్‌‌ను తీసుకునేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌‌‌‌డీఏఐ) ప్రమోట్ చేస్తోంది. ఈ కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులకు ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా అవసరమేనని పేర్కొంటోంది.42 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారు టర్మ్ ఇన్సూరె న్స్‌‌లను కొనడం బాగా పెంచారు. అంటే 77 శాతం మంది టర్మ్ ఇన్సూరెన్స్‌‌లను కొన్నారు. పాలసీల కొనుగోళ్లలో 31–35 ఏళ్ల వారు 30 శాతం షేరుతో ఫస్ట్ ప్లేస్‌‌లో ఉన్నారు. హై నెట్‌ వర్త్‌‌ ఇండివిడ్యువల్(హెచ్‌ ఎన్‌‌ఐ) సెగ్మెంట్‌ లో 80 శాతం మందికి పైగా కస్టమర్లు కోటి రూపాయలు, ఆపై ఎక్కువ కవర్‌‌‌‌ను తీసుకున్నారు. వారిలో 25 శాతం మంది రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల కవర్‌‌‌‌ను ఎంపిక చేసుకున్నారు. సెల్ఫ్ ఎంప్లా యిడ్ సెగ్మెంట్‌లో 41 శాతం మంది కస్టమర్లు రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌‌ను కొనుగోలు చేశారు. 40 శాతం మంది రూ. కోటి కవర్‌‌‌‌ను తీసుకున్నారు. శాలరీడ్ సెగ్మెంట్ కంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెగ్మెంట్ ట్రాఫిక్ బాగా పెరుగుతోంది.