
- పనిచేస్తేనే ఇల్లు గడిచేది..
- లాక్ డౌన్ తో ఉపాధి లేక పస్తులు
- మరింత కాలం పొడిగింపుతో పెరుగనున్న కష్టాలు
- సర్కార్ ఆదుకోవాలని వేడుకోలు
కరోనా వైరస్ నియంత్రణ కోసం చేపట్టిన లాక్డౌన్తో జనాల జీవన చిత్రం మారిపోతోంది. బయట దుకాణాల మూసివేత, జనాలు ఇంట్లోనే ఉండడంతో.. చేతివృత్తుల వారికి ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నరు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత, మధ్యతరగతి కుటుంబాలు తమ ఇండ్లలో పనులు చేయడానికి, వంట తయారీ, బట్టలు ఉతికేందుకు పనిమనుషులను పెట్టుకునేవారు. కరోనా విజృంభణ, లాక్‌డౌన్ రూల్స్ అమలుతో పనివాళ్లను బంద్ చేశారు. ప్రతీ ఇంట్లో ఎవరి పనులు చేసుకుంటున్నారు. ప్రతీ రోజు పని చేస్తేనే పూటగడిచే వారి పరిస్థితి దయనీయంగా మారింది .
ముసలోళ్లకు బోడగుండ్లు..
సెలూన్లు లేకపోవడంతో ఇంట్లో పిల్లలకు తండ్రి, తండ్రికి పిల్లలకు కటింగ్ చేస్తున్నారు. వృద్ధులకైతే ఏకంగా బోడిగుండ్లు చేస్తున్నారు. పల్లెల్లో బార్బర్ల ఇంటి వద్దకు వెళ్లి కొందరు కటింగ్ చేసుకుంటున్నా.. సిటీలో మాత్రం బార్బర్లకు ఎలాంటి ఉపాధి దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితే కుమ్మరి, కుమ్మరి , వడ్రంగి, చేనేత, ఇతర కులవృత్తులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ రూల్స్లో చేతి, కులవృత్తులకు కొంత మినహాయింపు ఇవ్వాలని సంబంధిత జనాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.