హెల్త్ డిపార్ట్ మెంట్ లొ కరోనా గుబులు

హెల్త్ డిపార్ట్ మెంట్ లొ కరోనా గుబులు
  • అక్కడ 11మందికి పాజిటివ్‌
  •  టెస్టులు చేయించుకున్న ముగ్గురు ఐఏఎస్‌లు..నేడు రిజల్ట్!
  •  పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ లో ఇద్దరికి కరోనా

వైద్యారోగ్యశాఖకు కరోనా సెగ తగిలింది. ఇప్పటికే వందల సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది వైరస్ బారిన పడగా, ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగులు, ఉన్నతాధికారులపైనా ప్రభావం పడింది. సెక్రటేరియట్‌‌లోని ఆరోగ్యశాఖ ఆఫీసులో 11 మందికి కరోనా సోకింది. వీరిలో డిప్యుటీ సెక్రటరీ స్థాయి ఆఫీసర్, డేటాఎంట్రీ ఆపరేటర్‌‌‌‌, నలుగురు అటెండర్లు, ఇతర సిబ్బంది‌‌ ఉన్నారు. దీంతో అక్కడి ఆఫీసులన్నింటినీ క్లోజ్ చేశారు. పది మంది తప్ప మిగతా ఉద్యోగులందరూ క్వారంటైన్‌‌లో ఉండాలని సూచించారు. ఈ దెబ్బతో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోయాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఆ శాఖలోని ఉన్నతాధికారులను కలిసినట్టు తెలిసింది. దీంతో ఆరోగ్య శాఖకు సంబంధించిన సీనియర్‌‌‌‌ ఐఏఎస్ ఆఫీసర్‌‌‌‌ శుక్రవారం కరోనా టెస్ట్‌‌ చేయించుకున్నారు. అదే శాఖలో పనిచేసే మరో ఐఏఎస్ ఆఫీసర్‌‌‌‌, వేరే శాఖలో పనిచేసే మరో ఐఏఎస్ ఆఫీసర్‌‌‌‌ కూడా కోఠిలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి శాంపిల్స్ ఇచ్చారు. మరోవైపు సెక్రటేరియటల్‌‌లోని మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌ డిపార్ట్‌‌మెంట్ ఆఫీసులో ముగ్గురికి కరోనా సోకింది. ప్రస్తుతం సెక్రటేరియట్​లో కేవలం 20 శాతం మంది ఉద్యోగులు మాత్రమే డ్యూటీకి వస్తున్నారు.

పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌‌లోనూ

హైదరాబాద్‌‌లోని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌‌లో పనిచేసే ఇద్దరు ఆఫీసర్లకు కరోనా సోకింది. వైరస్ కట్టడిలో కీలకమైన ఎపిడమాలజీ, ఐడీఎస్పీ విభాగాల్లో వీరు పనిచేస్తున్నట్టు ఆఫీసర్లు చెప్పారు. దీంతో వారిని కలిసిన ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకుముందు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ స్ర్కీనింగ్‌‌లో పనిచేసిన నలుగురికి కరోనా సోకగా, వాళ్లు కోలుకున్నారు.

హైలెవల్ కమిటీకి కరోనా దెబ్బ

కరోనా హైలెవల్‌‌ కమిటీకి కూడా కరోనా దెబ్బ తగిలింది. కమిటీ సభ్యుల్లో ఒకరైన డాక్టర్ గంగాధర్‌‌‌‌కు ఈ మధ్య పాజిటివ్‌‌రాగా, ప్రస్తుతం ఆయన హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నారు. ఆయన ప్రైమరీ కాంటాక్ట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌ రమేశ్‌‌రెడ్డికి జ్వరం రావడంతో మూడ్రోజుల ఆయన టెస్ట్ చేయించుకున్నారు. నెగటివ్ వచ్చింది. వైరస్ సింప్టమ్స్ లేకపోవడంతో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్‌‌‌‌, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు టెస్టు చేయించుకోలేదు.

హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో ఆఫీసులో కలకలం

హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో ఆఫీసులో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓ జిల్లా స్థాయి అధికారికి రెండు రోజుల క్రితం కరోనా వచ్చింది. దీంతో ఆఫీసులో ఆయనతో కాంటాక్ట్ అయిన వారు శాంపిల్స్​ని ఇచ్చారు. వారిలో ఇద్దరికి పాజిటివ్​ వచ్చింది. మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది.  దీంతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆఫీస్​ చిన్నగా ఉండటం, సిబ్బంది ఎక్కువగా పనిచేస్తుండటంతో ఫిజికల్ డిస్టెన్స్ పాటించేందుకు అవకాశం లేకుండా ఉంది. ఇప్పటికే కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 50 శాతం మంది సెల్ఫ్ ఐసోలేషన్​లో ఉన్నారు.