
కష్టంగా మారిన మెయింటెనెన్స్
దాతల కోసం ఎదురుచూపులు
చుట్టుపక్కల వారి నుంచి వేధింపులు
లాక్ డౌన్ ఎఫెక్ట్ ఆర్ఫేన్ హోమ్స్ పైనా పడింది. దాతలు, సంస్థల సాయంతో సజావుగా నడుస్తున్న ఆశ్రమాల్లో ఇప్పుడు సిబ్బంది లేక, సరుకులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 430 అనాథ శరణాలయాలు ఉండగా,
అందులో సగానికిపైగా గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. తల్లిదండ్రులు లేని, వివిధ కారణాలతో ఆశ్రమాల్లో ఉంటున్న పిల్లలు 10వేల మందికిపైనే. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 9 హోమ్స్ లో పెద్దగా సమస్యలు లేకపోయినా, ప్రైవేట్ హోమ్స్ నిర్వహణ కష్టంగా మారింది. లాక్డౌన్ వల్లదాతలు ముందుకు రాకపోవడంతో పిల్లల యోగక్షేమాలతో పాటు, ఫుడ్ ఐటమ్స్‌కు ఫైనాన్యల్ షియల్ గా ఇబ్బందవుతోందని నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు సిబ్బంది రాక పోవడం వల్ల నిర్వాహకులు అన్ని పనులు చేసుకోలేకపోతున్నారు. అధికారులు స్పందించి ఆహారం అందించాలని, పిల్లలకు మెడికల్ టెస్టులు చేయించాలని బాలల హక్కుల నాయకులు కోరుతున్నారు.
ఖాళీ చేయాలంటూ…
సికింద్రాబాద్ కార్కానాలోని ప్రియ కాలనీలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్ఫనేజ్ తో పాటు ఓల్డేజ్ హోం రన్ చేస్తోంది. లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఆ బిల్డింగ్ ఖాళీ చేయాలని స్థానికంగా కొందరు తమను టార్చర్ చేస్తున్నారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫండ్స్, సాయంచేసేందుకుకూడా ఎవరూ రావడం లేదని వాపోయారు.
పిల్లతో ఎటుపోవాలె
మా దగ్గర పిల్లలు, పెద్దలు కలిపి వందమంది పైనే ఉన్నారు. బిల్డింగ్స్ రెంట్ నెలకు రూ.1.20 లక్షలు. ఇంతకు ముందులా లాక్డౌన్తోపాటు డొనేషన్స్, ఫండ్స్ ఆగిపోయాయి. ఇలాంటి టైమ్లోనే ఇంతమంది పిల్లలను ఇక్కడ ఉంచొద్దు, ఖాళీ చేసి వెళ్లండని కొద్దిమంది ప్రెషర్ చేస్తు న్నారు. ఇప్పుడు ఎక్కడికి పోగలం?
– గౌతమ్, సర్వ్ నీడి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్