మహిళా వ్యాపారులపై కరోనా ప్రభావం

మహిళా వ్యాపారులపై కరోనా ప్రభావం

పెరిగిన సోషియో ఎకనమిక్‌‌ గ్యాప్‌‌: సర్వే

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ ప్రభావం మహిళలు నడుపుతున్న చిన్న వ్యాపారాలపై తీవ్రంగా పడిందని, దీంతో వ్యవస్థలో సోషియో ఎకనమిక్‌‌ గ్యాప్‌‌ పెరిగిందని ఓ సర్వే పేర్కొంది. ఈ జండర్‌‌‌‌ గ్యాప్‌‌ను తగ్గించేందుకు  ప్రభుత్వం, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు త్వరగా జండర్‌‌‌‌ సెన్సిటివ్‌‌ పాలసీని తీసుకురావాలని సలహాయిచ్చింది. గ్లోబల్‌‌ అలయెన్స్‌‌ ఫర్‌‌‌‌ మాస్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్(గేమ్‌‌), ఆంధ్రప్రదేశ్‌‌లోని క్రియా యూనివర్శిటీకి చెందిన లీడ్‌‌ ఈ సర్వేను నిర్వహించాయి. చిన్న వ్యాపారాలపై కరోనా సంక్షోభ ప్రభావం ఎంతుందో ఈ సంస్థలు లెక్కిస్తున్నాయి. ఈ ఏడాది మేలో ప్రారంభమైన ఈ సర్వే జనవరి నాటికి ముగుస్తుంది. జులై–ఆగస్ట్‌‌ టైమ్‌‌లో సేకరించిన డేటా ఆధారంగా జండర్‌‌‌‌ స్పెసిఫిక్‌‌ రిజల్ట్స్‌‌ను ఈ సంస్థలు రిలీజ్ చేశాయి. దీని కోసం మొత్తం 1,800 చిన్న వ్యాపారాల నుంచి డేటాను సేకరించాయి.