ర‌క్షా బంధ‌న్.. ఈ సారి ఇలా జ‌రుపుకుందాం.!

ర‌క్షా బంధ‌న్.. ఈ సారి ఇలా జ‌రుపుకుందాం.!

ర‌క్షా బంధన్… ఇండియన్ డే ఆఫ్ సిబ్లింగ్స్. ప్రతీ ఏటా ఇదొక సంబరం, రోజూ ఉండే టెన్షన్ల మధ్య నుంచి తప్పుకొని తోడబుట్టిన వాళ్లని కలుసుకొని ఆనందంగా ఉండే రోజు. అయితే ఈ సంవత్సరం మాత్రం కాస్త మార్పు వచ్చింది. కోవిడ్ దాడితో అన్ని పండగలలాగానే రాఖీపున్నమి కూడా ఈ సంవత్సరం కళ లేకుండా ఉంది. అయితే మన వాళ్ల క్షేమం కోసం అయినా ఈసారి జాగ్రత్తగా ఉండాల్సిందే. రాఖీ కట్టాలంటే మార్కెట్‌లో ఉండే షాప్స్ కి వెళ్లకుండా ఇంట్లోనే రాఖీ తయారు చేసుకుంటే బెటర్. ఇక దూరంగా ఉన్న వాళ్ల ఇళ్లకి వెళ్లకపోతేనే మంచిది. ఒక్క సంవత్సరం వెళ్ల కపోయినా పరవాలేదు. తోడబుట్టిన ప్రేమలకి ఎన్ని రాఖీలు సాటి వస్తాయి? ఇక కొరియర్ చేయటం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. ఆ కవర్ తో పాటు వైరస్ కూడా డెలివరీ అయితే కష్టం. అందుకే దగ్గరలో సోదరులకి మాత్రమే రాఖీ కట్టి దూరంగా ఉన్న అన్నదమ్ములకి ఫోన్, వీడియోకాల్ విషెస్ చెప్పొచ్చు. అందుకే…. ఈసారికి ఇంట్లోనే తయారు చేసిన రాఖీలే వాడదాం. అయితే రాఖీ చేయటం కోసమైనా మళ్ళీ పట్టు దారాలూ, రంగు కాగితాలూ మార్కెట్ నుంచే తేవాలికదా. అందుకే సింపుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ రాఖీ ట్రై చెయ్యొచ్చు.

పట్టు దారాలూ, చమ్కీ పూలు, రంగురంగుల కాగితాలు…ఇవన్నీ లేకపోయినా రాఖీ అందంగానే ఉంటుంది. చిన్న పసుపు, కుంకుమలు రాసిన దారం, దానికి కట్టిన మామిడాకు తోరణం అయినా చాలు కదా. కొద్దిగా పసుపు, ఇంకొంచం కుంకుమ… మరీ ఇవి ఏమిటీ అనిపిస్తే పిల్లల దగ్గర ఉండే స్కెచ్ పెన్నులతో రంగుల దారాలు తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న క్రాఫ్ట్ చేసే అలవాటు ఉంటే… ఆ వస్తువులతోనే రాఖీ తయారు చేసుకోవచ్చు. ఇక స్వీట్స్ కు బ‌దులు ల‌వంగాలు, పోష‌కాలిచ్చే ప‌ప్పు దినుసులు లాంటివి తినిపించ‌వ‌చ్చంటున్నారు. గిఫ్ట్ కు బ‌దులు మాస్కులు, శానిటైజ‌ర్లు ఇచ్చి క‌రోనా నుండి కాపాడుకుందామ‌ని ఈ రాఖీ పండుగ జ‌రుపుకుందాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం