
- నిన్న ఒక్కరోజే తెలంగాణలో 5,926 కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోంది. గడచిన 24 గంటల్లో ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 5,926 కేసులు నమోదయ్యాయి. ప్రైవేటుగా లెక్కలోనికి రాని కేసులు ఎన్నో తెలియడం లేదు. ప్రభుత్వం కరోనా పరీక్షలు, మరణాల వివరాలను దాస్తోందని.. నిజమైన లెక్కలు చెప్పడం లేదన్న ఆరోపణల నేపధ్యంలో తాజా లెక్కలు భయాందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజు తెలంగాణ లో నమోదైన పాజిటివ్ కేసులు 5926 కాగా ఇప్పటి వరకు మరణాలు 18,793కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ గ్రేటర్ హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 488 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మేడ్చెల్ మరియు మల్కాజ్ గిరి పరిధిలో మరో 444 కేసులు నమోదు కాగా.. నిజామాబాద్ జిల్లాలో కూడా 455 కేసులు నమోదయ్యాయి.