నాలుగు నెలల్లో కరోనా ఫోర్త్ వేవ్ :ఐఐటీ కాన్పూర్

నాలుగు నెలల్లో కరోనా ఫోర్త్ వేవ్ :ఐఐటీ కాన్పూర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. థర్డ్ వేవ్ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఐఐటీ కాన్పూర్ రీసెర్చర్లు మరో బాంబు పేల్చారు. మరో నాలుగు నెలల్లో కరోనా నాల్గో దశ ప్రారంభంకావచ్చని ప్రకటించారు. జూన్ చివరి వారంలో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమై అక్టోబర్ 24 వరకు కొనసాగొచ్చని అంటున్నారు. ఆగస్టు 14 నుంచి 31 మధ్యకాలంలో కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్ఫూర్ ప్రొఫెసర్లు అంచనా వేస్తున్నారు. ఆ సమయానికి పుట్టుకొచ్చే వేరియెంట్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, బూస్టర్ డోస్ల పంపిణీపై నాల్గో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ టీం రూపొదించిన రీసెర్చ్ పేపర్  MedRxivలో ఫిబ్రవరి 24న ప్రచురితమైంది.  

గత మూడు వేవ్లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ రీసెర్చర్ల అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడించిన విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. బూట్ స్టాప్ మెథడ్ ఆధారంగా ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు ఫోర్త్ వేవ్కు సంబంధించి తాజా అంచనాలు వెలువరించారు. దీని ప్రకారం భారత్ లో కొవిడ్ 19 ప్రారంభమైన 936 రోజులకు కరోనా నాల్గో దశ ప్రారంభం కానుంది. 

For more news..

బెలారస్‌ వేదికగా రష్యాతో శాంతి చర్చలకు నో

ఏనుగు ఎక్కి పార్కులో తిరిగిన రాష్ట్రపతి కోవింద్