హైదరాబాద్ సీసీఎంబీ నుంచి కరోనా ఇమ్యూనిటీ బూస్టర్

హైదరాబాద్ సీసీఎంబీ నుంచి కరోనా ఇమ్యూనిటీ బూస్టర్

సీసీఎంబీలోని అటల్ అంకుర కేంద్రం డెవలప్ చేసిన ప్రొడక్ట్

రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉన్న ఒక ఓరల్  సస్పెన్సన్

యాంటీ వైరల్.. ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందంటున్న సీసీఎంబీ నిపుణులు

డిసెంబర్ తర్వాతనే మార్కెట్లోకి..

హైదరాబాద్: కరోనా ట్రీట్ మెంట్ పరిశోధనల్లో గొప్ప ముందడుగు పడింది. హైదరాబాద్ సీసీఎంబీ సైంటిస్టులు కరోనా ఇమ్యూనిటీ బూస్టర్ ను తయారు చేశారు. హిమాలయ  ప్రాంతంలో దొరికే  కార్డిసెప్స్ మిలిటరిస్ (Cordyceps militaris) అనే పుట్టగొడుగుల  నుండి అభివృద్ధి చేసినట్టు సీసీఎంబీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. సీసీఎంబీ లోని అటల్  అంకుర కేంద్రం వారు డేవలప్  చేసిన  “కరోనా ఎయిడ్”  అనే ఇమ్యూనిటీ బూస్టర్  ప్రోడక్ట్  ను  లాంచ్ చేశారు. ఈ ప్రోడక్ట్ అనేక పోషక విలువలు కలిగి ఉండి,  యాంటీ వైరల్ గా, ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుందని  వెల్లడించిన సీసీఎంబీ నిపుణులు చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి తీసుకుని లాంచ్ చేస్తున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సీసీఎంబీ నిపుణులు ప్రాడక్టు గురించి మాట్లాడారు. హైదరాబాద్ లోని  “అంభోసియమ్”  ఆహార  సంస్థలతో  కలిసి ఈ పుట్టగొడుగుల పొడిని, పసుపు లోని  కార్కియుమిన్ అనే పదార్థంతో కలిపి ఈ “కరోనా ఎయిడ్”  అనే ఇమ్యూనిటీ బూస్టర్ ను తయారు చేసినట్లు తెలిపారు. ఇది రోగనిరోధక  శక్తిని  అధికంగా కలిగి ఉన్న ఒక ఓరల్  సస్పెన్సన్ మాత్రమేనన్నారు. క్లోన్  డీల్ సంస్థ, సీసీఎంబీ శాస్త్రవేత్తల  సహాయంతో “సెల్  కల్చర్ ను ఉపయోగించి   “కార్డీసీఫెన్” కరోనా వైరస్ ను నిరోధిస్తుందని ప్రయోగ  పూర్వకంగా తెలుసుకున్నారు.  కోన్ డీల్ సంస్థ వారు పుట్ట గొడుగుల మందుల  తయారీలో , ఇమ్యూనిటీ అభివృద్ధి ప్రక్రియలో  నిష్ణాతులు… ఈ సంస్థ ప్రతినిధులు ఈ ఫార్ములేషన్  ప్రయోగాల  కోసం  నాగపూర్ , ముంభై , భోపాల్  లోని 3 అఖిల భారత ఆయుర్  విజ్ఞాన సంస్థలతో క్లినికల్  ప్రయోగాల అనుమతుల  కోసం అప్లై చేశారు. ఈ ప్రయోగాలు డిసెంబర్  నాటికి పూర్తి అయ్యి, అన్ని నగరాల్లో , పట్టణాల్లో  లభ్యమవుతుంది తెలిపారు. క్లోన్ డీల్ సంస్థ నుండి డా.అయోధ్య ప్రకాష్, డా.అతిక్ పటేల్ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం నాటికి ఈ ప్రొడక్టు మొత్తం ప్రపంచానికి అందుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా  మాట్లాడుతూ…స్వదేశీ  సహజ ఉత్పత్తులను  ఉపయోగించి , విలువైన  పదార్థాల  ఉత్పత్తికి  అంకుర పరిశ్రమలను  ప్రోత్సహించడం చాలా ఆనందదాయకమని అన్నారు. సీసీఎంబీ ఛీఫ్ డా.మధుసూదన్  రావ్ మాట్లాడుతూ …. సరైన వనరులు సమకూర్చి, శాస్త్రీయ  సహాయాన్ని అందించినట్లైతే  క్లోన్ డీల్ వంటి ఎన్నో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు అని పేర్కొన్నారు. కరోనా ఎయిడ్ ప్రోడక్ట్  ను వరల్డ్ వైడ్  గా న్యూజెన్  హేర్బల్స్  ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేకంగా విక్రయించనుంది.