భారత్‌లో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి కరోనా

భారత్‌లో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి కరోనా

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి (ఎండెమిక్‌) దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైంటిస్టు డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌. భారత్‌ జనాభా.. వారి రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను చూస్తే.. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లాగే.. మరికొంతకాలం వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశముందన్నారు. ఇక సెప్టెంబర్‌ మధ్యనాటికి భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాగ్జిన్‌ టీకాకు WHO ఆమోదం తెలిపే అవకాశముందన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆఖరు నాటికి 70 శాతం పూర్తయితే.. కోవిడ్‌ను అధిగమించొచ్చని.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

 మరోవైపు థర్డ్ వేవ్ పై తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని సౌమ్య స్వామినాథన్‌ భరోసా ఇచ్చారు. ఒకవేళ పిల్లలకు కరోనా సోకినా తీవ్రత తక్కువగానే ఉంటుందని ఇటీవలి సీరో సర్వేలు, విదేశాల్లోని పరిస్థితులను చూస్తే అర్థమవుతోందన్నారు. పిల్లల్లో కరోనా మరణాల రేటు చాలా తక్కువన్నారు. అయినా కూడా పిల్లలకు మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందన్న దానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు.