కరోనా ఇన్ పేషెంట్లు తగ్గుతున్రు

కరోనా ఇన్ పేషెంట్లు తగ్గుతున్రు
  • రికవరీ అయ్యేటోళ్లు పెరుగుతున్రు
  • రెండ్రోజులుగా యాక్టివ్ కేసులు కూడా తగ్గుముఖం 
  • కొత్తగా 6,876 మందికి వైరస్.. 59 డెత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్ల సంఖ్య కూడా తగ్గుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే, రికవరీ అవుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. టెస్టుల పాజిటివ్ రేటులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వారం నుంచి ప్రతి రోజూ టెస్టు చేయించకున్న వాళ్లలో 10 శాతం మందికి పాజిటివ్ వస్తోంది. టెస్టుల సంఖ్య పెరిగితే కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్ల సంఖ్య తగ్గుతుండటంతో వైరస్ తీవ్రత తగ్గుతున్నట్లుగా అనిపిస్తోందని డాక్టర్లు చెప్తున్నారు.
దవాఖాన్లలో 23 వేల మంది 
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో కలిపి 23,146 మంది కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇందులో 6,422 మంది వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై, 11,288 మంది ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో ఉన్నారు. మరో, 5,436 మంది నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్లపై చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రానికి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్ల సంఖ్య 24,200కుపైగా ఉండగా, మంగళవారం సాయంత్రానికి 23,146కు తగ్గింది. 
7,432 మంది రికవరీ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 7,432 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారని, కొత్తగా 6,876 మంది వైరస్ బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ ప్రకటించింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,029, జిల్లాల్లో 6,403 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 4,63,361కు పెరిగింది. ఇందులో 3,81,365 మంది కోలుకున్నట్టు బులెటిన్ లో చూపించారు. మరో, 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే మూడ్రోజుల కిందట 80,695 యాక్టివ్ కేసులు ఉండగా, రెండ్రోజులుగా ఇవి తగ్గుతున్నాయి. కరోనాతో సోమవారం మరో 59 మంది చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 2,476కు చేరినట్టు చూపించారు.
మైల్డ్ సింప్టమ్స్ ఉంటే చేర్చుకోవద్దు
మైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింప్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దని ప్రైవేట్ హాస్పిటళ్లకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు. మైల్డ్ సింప్టమ్స్ తో ఆక్సిజన్ లెవల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 94 కంటే తక్కువగా ఉన్నోళ్లనే చేర్చుకోవాలని సూచించారు. 94 కంటే ఎక్కువగా ఉంటే హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సజెస్ట్ చేయాలన్నారు. మోడరేట్, సివియర్ పేషెంట్లను అడ్మిట్ చేసుకోవడంలో ఆలస్యం చేయొద్దని సూచించారు. అడ్మిట్ చేసుకోవడానికి టెస్ట్ రిపోర్ట్ అడగొద్దని ఆదేశించారు.  హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐసీయూ, ఆక్సిజన్, నార్మల్ బెడ్ల వివరాలు, అందులో ఖాళీల సంఖ్య ప్రదర్శించాలని ఆదేశించారు. ఎప్పటికి అప్పుడు ఆ బోర్డును అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేయాలని సూచించారు. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్ టైంలోనూ ఇలాగే ఆర్డర్ రిలీజ్ చేసినా.. ఒక్క హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా హెల్త్ డైరెక్టర్ ఆదేశాలను పాటించలేదు. హెల్త్ డైరెక్టర్ కూడా చర్యలు తీసుకోలేదు.