గర్భిణులూ.. కరోనాతో జాగ్రత్త!

గర్భిణులూ.. కరోనాతో జాగ్రత్త!

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ బారిన పడకుండా గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు జనం ఎక్కువుండే ప్రాంతాలకు వెళ్లొద్దంటున్నారు. ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అత్యవసరం అనుకుంటేనే హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలని సీనియర్‌‌‌‌‌‌‌‌ గైనకాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ చీపురుపల్లి వసుందర సూచించారు. రైళ్లు, బస్సులు, విమానాల్లో ప్రయాణం వద్దని చెప్పారు. సబ్బు, శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచించారు. నిద్రపోయేటప్పుడు గదిలో వెలుతురు ఎక్కువుండేలా చూసుకోవాలన్నారు. గర్భిణులు వైరస్‌‌‌‌‌‌‌‌ బారిన పడితే నెలలు నిండకముందే ప్రసవమవుతుందని, పైగా తల్లీబిడ్డపై ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.