Prabhas : డార్లింగ్ అంటే ఈయనే.. అభిమాని పుట్టినరోజున ప్రభాస్ స్పెషల్ సర్ప్రైజ్

 Prabhas : డార్లింగ్ అంటే ఈయనే.. అభిమాని పుట్టినరోజున ప్రభాస్ స్పెషల్ సర్ప్రైజ్

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యంగ్ హీరో కేవలం సినిమాలతోనే కాదు.. తన వ్యక్తిత్వంలోనూ కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన వింటేజ్ కామెడీ అండ్ హారర్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ ఉత్సాహంలో ఉండగానే, ఆయన తన నిరాడంబరతతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు.  లేటెస్ట్ గా ఒక వీరాభిమాని ప్రభాస్ ను కలిసిన తీరు, ఆయన చూపించిన వినయం నెట్టింట వైరల్ అవుతోంది.

భగవద్గీత బహుమతిగా..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్ నివాసానికి ఒక మహిళా అభిమాని (శ్రీలేఖ) తన పుట్టినరోజు సందర్భంగా  గురువారం ( జనవరి 7, 2026 ) ఆయన్ని కలవడానికి వచ్చింది. అయితే సాధారణంగా స్టార్ హీరోలను కలవడం అంటే గేట్ దగ్గరే సెక్యూరిటీ ఆపేస్తుంది. కానీ ప్రభాస్ మాత్రం స్వయంగా గేట్ దగ్గరకు వచ్చి ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభాస్‌కు ‘భగవద్గీత’ పుస్తకాన్ని, అలాగే ఆయన పెంచుకునే పెంపుడు జంతువు (Pet) కోసం కొన్ని చిన్న బహుమతులను అందజేసింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా వాటిని స్వీకరించి, ఆమెతో సరదాగా ముచ్చటించారు.

ALSO READ : ‘పరాశక్తి’కి సెన్సార్ సెగ.. విజయ్ దారిలోనే శివకార్తికేయన్ మూవీ వాయిదా?

 ప్రభాస్ నిజంగా ఆణిముత్యమే..

ఈ సందర్భంగా.. శ్రీలేఖ తన అభిమాన హీరో ప్రభాస్ ను కలిసి వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. "ఆయన ఎంతటి గొప్ప మనిషో మాటల్లో చెప్పలేను. స్వయంగా గేట్ దగ్గరకు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. ప్రభాస్ గారు నిజంగా ఒక ఆణిముత్యం" అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఎమోషనల్ అయ్యారు. తన పుట్టిన రోజు ప్రభాస్ ను కలిసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్ ను ఇంత దగ్గరగా కలిసి, ఆయనతో సమయం గడపడం నా అదృష్టంగా భావిస్తున్నాను . దీనికంటే నేను ఇంకేం కోరుకోగలను అంటూ శ్రీలేఖ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ALSO READ : నంబర్ 1 ట్యాక్స్ పేయర్ రష్మిక..

 

బాక్సాఫీస్ వద్ద ‘రాజా సాబ్’ సందడి!

మరోవైపు, జనవరి 9న ‘ది రాజా సాబ్’ థియేటర్లలోకి రాబోతోంది. సుమారు మూడేళ్ల నిరీక్షణ తర్వాత ప్రభాస్ ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌తో వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఈ సినిమాకు జనవరి 8న ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. భారీ అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

ALSO READ : హైదరాబాద్ క్రైమ్ కథతో శోభిత మూవీ..