ఈ కాలంలో వయస్సుకి మించి బరువు కేసులు పెరుగుతుండటంతో చాల మంది వేంగంగా, త్వరగా అది కూడా తక్కువ కాలంలోనే బరువు తగ్గే మందులు లాంటివి వాడుతున్నారు. అయితే ఆరోగ్యాంగా బరువు తగ్గేందుకు మార్గాలు ఉన్న అందుకు తగిన సమయం దొరక్క లేదా ఈ బిజి బిజి లైఫ్ లో ఆరోగ్యంపై కొంత సమయం కేటాయించలేకపోవడంతో రోజులు గడిచిపోతుంది.
దీనికి సంబంధించి మౌంజారో లేదా వెగోవీ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు తీసుకొని సన్నగా ఉండేవారు, సాధారణ డైటింగ్, వ్యాయామం ఆపేసిన వారి కంటే నాలుగు రెట్లు వేగంగా తిరిగి బరువు పెరుగుతారని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి.
ALSO READ : బరువు తగ్గుతారు.. ప్రోటీన్లు పుష్కలం..
బరువు తగ్గించే ఇంజెక్షన్లు (Weight loss injections) తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మౌంజారో లేదా వెగోవీ వంటి ఇంజెక్షన్లు వాడి బరువు తగ్గిన వారు, ఆ మందులు ఆపేసిన తర్వాత సాధారణ డైటింగ్ చేసే వారి కంటే నాలుగు రెట్లు వేగంగా మళ్ళీ బరువు పెరుగుతున్నారని తేలింది.
పరిశోధనలో తెలిసిందేంటంటే.. ఇంజెక్షన్లు వాడి బరువు తగ్గిన వారు మందులు ఆపేసిన తర్వాత నెలకు సగటున 0.8 కిలోల బరువు పెరుగుతున్నారు. అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరంలోనే వారు ముందు ఉన్న బరువుకే చేరుకుంటున్నారు.
ఈ ఇంజెక్షన్లు శరీరంలో ఆకలిని కంట్రోల్ చేసే GLP-1 అనే హార్మోన్‌ను కృత్రిమంగా పెంచుతాయి. మందులు ఆపేయగానే మెదడులో ఆకలి ఒక్కసారిగా పెరిగిపోయి, విపరీతంగా తినాలనిపిస్తుంది.. దీనినే 'కోల్డ్ టర్కీ' అని కూడా పిలుస్తారు.
ALSO READ : రోజుకు ఎన్ని అడుగులు వేస్తే లాభం..
కేవలం ఆహార నియమాలు, వ్యాయామం పాటించే వారు నెమ్మదిగా బరువు తగ్గిన.. వారు మళ్ళీ బరువు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా నెలకు 0.1 కిలో ఉంటోంది.
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకురాలు డాక్టర్ అభిప్రాయం ప్రకారం, ఈ ఇంజెక్షన్లు వాడేవారు మెడిసిన్ ఆపగానే బరువు పెరుగుతాం అన్న నిజాన్ని ముందే తెలుసుకోవాలి. సరైన జీవనశైలి మార్పులు అంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటి అలవాటు చేసుకోకుండా కేవలం ఇంజెక్షన్లపైనే ఆధారపడితే ఫలితం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ : ఆరెంజ్ జ్యూస్‌లో చక్కెర కలపడం మంచిదేనా?
బ్రిటిష్ ఆరోగ్య సంస్థ NHS ప్రకారం, ఈ ఇంజెక్షన్లు కేవలం ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే. బరువు పెరగకుండా ఉండాలంటే వీటిని జీవితాంతం వాడాల్సి ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ, సహజమైన ఆహార నియమాలు, వ్యాయామమే ఎక్కువకాలం పాటు బరువును అదుపులో ఉంచుతాయి.
