ఏప్రిల్ 10, 11న కరోనా మాక్‌‌‌‌డ్రిల్

ఏప్రిల్ 10, 11న కరోనా మాక్‌‌‌‌డ్రిల్

హైదరాబాద్, వెలుగు: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరు గుతుండడం, మన స్టేట్‌‌లోనూ వైరస్ వ్యాప్తి ఉండడంతో దవాఖాన్లలో మాక్‌‌ డ్రిల్ నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణ యించింది. 10, 11వ తేదీల్లో అన్ని సర్కార్ దవాఖాన్లలో మాక్ డ్రిల్ చేయాలని సూపరింటెండెంట్లకు ఉన్న తాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కరోనా ట్రీట్​మెంట్​కోసం ఎన్ని బెడ్లు కేటాయించగలం? హాస్పిటల్‌‌లో సరిపడా డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నారా? టెస్టింగ్, డయా గ్నస్టిక్ కెపాసిటీ, లాజిస్టిక్ సర్వీసెస్‌‌, ఆక్సిజన్ కెపాసిటీ, టెలీ మెడిసిన్ ఫెసిలి టీ తదితర అన్ని అంశాలను పరిశీలిం చాలని, పూర్తి సమాచారంతో హెడ్‌‌ ఆఫీస్‌‌కు రిపోర్ట్‌‌ పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి బెడ్‌‌కు ఆక్సిజన్ సప్లై చేసి, అవసరమైన రిపేరింగ్స్‌‌, సర్వీసింగ్ చేయించాలని సూచించారు.