కీసరలో దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ పై కిరణ్ పై అనే పాల వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. గురువారం ( జనవరి 8 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బాకీ వసూళ్ల విషయంలో గొడవ కారణంగా దొడ్ల మేనేజర్ శ్రీనివాస్ పై కిరణ్ అనే పాల వ్యాపారి తల్వార్ తో దాడికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా పాల వ్యాపారం చేస్తున్న కిరణ్ దొడ్ల కంపెనీకి బకాయి పడ్డాడు. బాకీ విషయంలో మేనేజర్ శ్రీనివాస్ కి, కిరణ్ కి మధ్య మొదలైన గొడవ దాడికి దారి తీసింది.
కిరణ్ బాకీ పడటంతో అతనికి పాలు వేయొద్దని వ్యాన్ డ్రైవర్ కి చెప్పాడు మేనేజర్ శ్రీనివాస్. దీంతో కిరణ్, శ్రీనివాస్ మధ్య జరిగిన గొడవలో శ్రీనివాస్ పై తల్వార్ తో దాడి చేశాడు కిరణ్. ఈ ఘటనలో మేనేజర్ శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్ మౌలాలి వాసిగా గుర్తించారు పోలీసులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కిరణ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
