ఫొటోషాప్ తో ఫేక్ సర్టిఫికెట్లు..తాండూర్ లో వ్యక్తి అరెస్ట్

ఫొటోషాప్ తో ఫేక్ సర్టిఫికెట్లు..తాండూర్ లో వ్యక్తి అరెస్ట్

వికారాబాద్, వెలుగు: తాండూర్​లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టైంది. ఇంటర్నెట్​​సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి పలు మండలాల్లో ఏజెంట్లను పెట్టుకుని ఫేక్​ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్ముతున్నాడు. ఇంటర్నెట్​లో ఒరిజినల్​ సర్టిఫికెట్లను డౌన్​లోడ్​ చేసి దానిలో ఉన్న సమాచారాన్ని ఫొటో షాప్ ద్వారా ఎడిట్​చేసి జనన, మరణ పత్రాలు తయారు చేస్తున్నారు. 

ఇలా పొందిన సర్టిఫికెట్లు ఫేక్​ అని తెలుసుకున్న ఓ బాధితుడు మంగళవారం బషీరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాండూర్​లోని ఆసిఫ్​ను అరెస్ట్ చేశారు. ఆసిఫ్​ను విచారించగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తుల పేర్లు చెప్పినట్లు తెలిపారు. ఈ కేసులో చాలా మంది పాత్ర ఉందని, విచారణ లోతుగా చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు.