V6 News

24 గంట‌ల్లో 1463 క‌రోనా కేసులు.. 29 మ‌ర‌ణాలు

24 గంట‌ల్లో 1463 క‌రోనా కేసులు.. 29 మ‌ర‌ణాలు

దేశంలో రోజు రోజుకీ భారీగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లోనే 1463 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఒక్క రోజులో న‌మోదైన అత్య‌ధిక కేసులు ఇవే. ఇవాళ న‌మోదైన 1463 కేసుల‌తో క‌లిపి మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 10,815కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో 29 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 353కి చేరంద‌ని చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1190 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ప్ర‌స్తుతం 9272 మంది చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ‌.

రాష్ట్రాల వారీగా చూస్తే మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 2337, ఢిల్లీలో 1510, త‌మిళ‌నాడులో 1173 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రాజ‌స్థాన్ లో 879, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 730, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 657, గుజ‌రాత్ లో 617 మందికి వైర‌స్ సోకింది. తెలంగాణ‌లో 624 మంది, ఏపీలో 473 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.