కరోనా కాలం: బ్రీతింగ్​ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు బెటర్​

కరోనా కాలం: బ్రీతింగ్​ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు బెటర్​
  • కరోనా తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఫిట్‌నెస్ తప్పనిసరి
  • శ్వాసకోస ఇబ్బందులకు  బ్రీతింగ్​ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు బెటర్

ప్రస్తుతం కరోనా కాలం. రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌‌ వచ్చినవాళ్లు త్వరగానే తిరిగి కోలుకుంటున్నారు. అయితే, కోలుకున్నాం కదా అని లైట్‌‌ తీసుకోకూడదు.కరోనా తరువాత వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఫిట్‌‌నెస్‌‌పై దృష్టిపెట్టాలని చెప్తున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయడం వల్ల కొవిడ్‌‌ స్ట్రెస్‌‌ నుంచి కూడా రిలీఫ్‌‌ ఉంటుందట. అలాగని మరీ కష్టమైన ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేయొద్దు. ఊపిరితిత్తులను స్టెబ్‌‌లైజ్‌‌ చేసుకుంటూ, ఫిజికల్‌‌గా కూడా స్ట్రాంగ్‌‌గా ఉండేలా కొన్ని సింపుల్‌‌ వర్కవుట్స్‌‌ చేయాలని సూచిస్తున్నారు. 

  • కరోనా ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుంది. కాబట్టి రెగ్యులర్‌‌‌‌గా ప్రాణాయామం లాంటి బ్రీతింగ్‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేస్తే మంచిది.
  • వాకింగ్‌‌ చాలా సులభమైన ఫిజికల్‌‌ యాక్టివిటీ. అయినా, దాని వల్ల చాలామంచి ఎఫెక్ట్‌‌ కనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు వాకింగ్‌‌ చేస్తే మంచిది.
  •  చాలామందికి ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు స్టూల్‌‌ సాయంతోనే కొన్ని ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేయొచ్చు. స్టూల్‌‌మీద స్ట్రయిట్‌‌గా కూర్చోవాలి. తర్వాత ఒక కాలుపైకి లేపి 2 – 3 సెకన్లు గాలిలో ఉంచాలి. ఇలానే రెండో కాలితో చేయాలి. ఈ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌నే ‘సిట్టింగ్‌‌ మార్చ్‌‌’ అంటారు. రెండుచేతులు పైకి లేపి కుర్చీలో కూర్చున్నట్లుగా వంగి బ్యాలెన్స్‌‌ చేసుకోవాలి. అలా కూర్చుని లేస్తూ ఉండాలి. దాన్నే ‘సిట్‌‌ టు స్టాండ్‌‌’ వర్కవుట్‌‌ అంటారు.
  • కుర్చీలో నిటారుగా కూర్చొని కాలివేళ్లు నేలకు ఆనిస్తూ మడమలు పైకి లేపాలి. తర్వాత మడమలు నేలకు అనిస్తూ కాలి వేళ్లను పైకి లేపాలి. అలా 10 – 20 సార్లు చేయాలి. ఈ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ను ‘టో లిఫ్ట్స్‌‌’ అంటారు.
  • నిటారుగా నిలబడి కాళ్లు రెండూ కొద్దిగా వెడల్పుగా పెట్టాలి. కుడి కాలిని పైకిలేపి కిందపెట్టాలి. అలానే ఎడమకాలిని పైకిలేపి మళ్లీ కిందపెట్టాలి. ఇలా 10 సార్లు చేయాలి. దీన్నే సైడ్‌‌ లెగ్‌‌రైజ్‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ అంటారు.