9 లక్షలు దాటిన కరోనా కేసులు

9 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు వేలల్లో పెరుగుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా  కరోనా కేసులు 9,36,170 కు చేరగా..47249 మంది మరణించారు.  ప్రపంచ వ్యాప్తంగా 2,15,300 కరోనా పాజిటివ్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఇటలీ 1,10,574 , స్పెయిన్ 1,04,118, చైనా 81, 554, జెర్మనీ 77,981,  ఫ్రాన్స్ 56, 989 కేసులు నమోదయ్యాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా 47246 మరణించగా..ఒక్క ఇటలీలోనే 13155 మంది కరోనాతో చనిపోయారు. ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్ 9387, అమెరికా 5110,  ఫ్రాన్స్ 4032 ,చైనా 3312 ఇరాన్ 3036,యూకే 2352 మరణాలతో ఉన్నాయి.

భారత్ లో 2 వేలు దాటిన కరోనా కేసులు