
రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు కూడా కరోనా బారినపడటం చూశాం. కానీ తాజాగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు కూడా కరోనా బారినపడుతున్నారు. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డికి తాజాగా మరోసారి కరోనా సోకింది. ఆయన ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కరోనా బారినపడటం గమనార్హం. రమేష్ రెడ్డి ఫస్ట్ వేవ్‌లో కరోనా బారినపడ్డారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత విడతలవారీగా ఆయన రెండు డోసులు వేయించుకున్నారు. అయినా కూడా ఆయనకు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్టేబుల్‌గా ఉంది. పాజిటివ్ రావడంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్ల వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఆయన ఇటీవలే పాల్గొన్నారు.