
ప్రముఖ జానపద గాయకురాలు షర్దా సిన్హా కరోనా బారిన పడ్డారు. దీనికి సంబంధించి షర్దా సిన్హా ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన ఓ వీడియోలో ఈ విషయాన్ని తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ వచ్చిందని చెప్పారు.
షర్దా సిన్హా ప్రముఖ మైథిలీ జానపద గాయకురాలు. బీహార్ కోకిలగా పేరు ఉన్న ఈమె భోజ్‌పురితో పాటు పలు భాషల్లో జానపద పాటలు పాడారు. 2018వ సంవత్సరంలో షర్దా సిన్హా పాడిన ఛాత్ పూజా పాట ‘హో దీనానాథ్’కు పద్మభూషణ్ అవార్డు లభించింది. షర్దాసిన్హా ఛాత్ పూజా పాటలతోపాటు ‘కహే తో సే సజ్నా’, మైనే ప్యార్ కియా, హమ్ హై కోన్, గ్యాంగ్స్ ఆఫ్ వాసియాపూర్, ఛర్ ఫూటియా ఛోక్రీ, దేశ్వా తదితర హిందీ సినిమాల్లో పలు పాటలు పాడారు.