రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్

రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్


త్వరలో టీమిండియా ఇంగ్లాండ్తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ ఆడబోతుంది. మొదటగా జూలై 1 నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ఆడబోతుంది. గతేడాది కరోనా వల్ల వాయిదా పడిన అయిదో టెస్టు రీషెడ్యూల్లో భాగంగా జులై1 నుంచి జరగనుంది. ఆ తర్వాత మూడు టీ20లు, రెండు వన్డే మ్యాచుల్లో భారత జట్టు పాల్గొననుంది. ఫస్ట్ టీ20 7న, 9,10 తేదీల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచులు జరగనున్నాయి. అనంతరం వన్డే సిరీస్ మొదలవుతుంది. 12న ఓవల్లో ఫస్ట్ వన్డే,  14న లార్డ్స్‌లో సెకండ్ వన్డేల్లో ఇరు జట్లు తలపడతాయి. 

అయితే ఇంగ్లాండ్ టూర్కు స్టార్ ఆల్ రౌండర్ అశ్విన్ దూరమయ్యాడు.  అతని కరోనా సోకడంతో అతను జట్టుతో కలిసి వెళ్లలేదు. ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటీవ్ రావడంతో..అశ్విన్ క్వారంటైన్ లోకి వెళ్లాడు. రెండు వారాల పాటు అతను క్వారంటైన్ లో ఉండనున్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్ తో జరిగే ఏకైక టెస్టు మ్యాచు నుంచి అశ్విన్ తప్పుకున్నాడు. 

జులై 1 నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ..అప్పటిలోగా కోలుకుంటాడని బీసీసీఐ భావిస్తోంది. అశ్విన్ టెస్ట్ మ్యాచులో ఆడకపోయినా..వన్డే, టీ20 సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.