చెన్నైలోని ముగ్గురు IPS అధికారులకు కరోనా పాజిటివ్

చెన్నైలోని ముగ్గురు IPS అధికారులకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ స్పీడ్ గా వ్యాపిస్తూ తమిళనాడు ప్రజలను వణికిస్తోంది. పది రోజుల్లోనే కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. వీటిలో అత్యధికంగా చెన్నైలోనే నమోదయ్యాయి. కోయంబేడు మార్కెట్ ప్రభావం  చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో కూడా వైరస్ ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కరోనా బారినపడ్డారు. చెన్నై స్టాన్లీ ప్రభుత్వాస్పత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కు కూడా వైరస్ సోకింది.