
ఢిల్లీ సాకేత్ లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో కరోనా కలకలం రేగింది. కోర్టులో పనిచేసే ఓ ఉద్యోగి ఒకరు సోమవారం కరోనా వైరస్ సోకి చనిపోవడంతో 20 మందిని హోం క్వారంటైన్ లో ఉంచారు. జడ్జికి 10 రోజుల క్రితమే పాజిటివ్ రాగా లేటెస్ట్ గా ఆయన భార్య, కూతురు, అల్లుడికి కరోనా సోకిందని తేలింది. వీరందరికీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి సౌత్ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్నాడని… అక్కడి నర్సు నుంచి అతడికి వైరస్ సోకిందని అధికారులు చెప్పారు. సాకేత్ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించామన్నారు.