ఆఫీస్​ వద్దు.. వర్క్ ఫ్రమ్ హోమ్​ బెటర్

ఆఫీస్​ వద్దు.. వర్క్ ఫ్రమ్ హోమ్​ బెటర్
  •     ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఇద్దరి అభిప్రాయమిది
  •     లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో వెల్లడి 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కు అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభించే చాన్స్ ఉందని ఆందోళన చెందుతున్నారు. లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 28 వేల మందిపై సర్వే చేశామని.. వారిలో 63 శాతం మంది మగవాళ్లు, 37 శాతం మంది మహిళలు ఉన్నారని సంస్థ తెలిపింది. టయర్ 1, 2, 3, 4 సిటీలతో పాటు రూరల్‌‌‌‌ జిల్లాల్లోనూ సర్వే చేసినట్లు చెప్పింది. ‘‘కరోనాతో వర్క్‌‌‌‌ ఫ్రమ్ హోమ్ పెట్టాలని భావిస్తున్నారా?’’ అనే ప్రశ్నకు 67 శాతం మంది పెట్టాలని, 28 శాతం మంది వద్దని చెప్పారని, 5 శాతం మంది ఏమీ చెప్పలేదని పేర్కొంది. ప్రస్తుతం 58% మంది ఆఫీసులకు వెళ్తున్నట్లు సర్వేలో తేలింది. వారంలో రెగ్యులర్‌‌‌‌గా డ్యూటీకి వెళ్తున్నామని 40 శాతం మంది, కొన్ని రోజులు మాత్రమే వెళ్తున్నామని 18 శాతం మంది, వర్క్‌‌‌‌ ఫ్రమ్ హోమ్ చేస్తూ కొన్ని మీటింగ్‌‌‌‌లకు మాత్రమే వెళ్తున్నామని 18 శాతం మంది చెప్పారు. వర్క్‌‌‌‌ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేస్తున్నామని 24 శాతం మంది తెలిపారు. 

36% ఆఫీసుల్లోనే వెంటిలేషన్... 
ఆఫీసుల్లో వెంటిలేషన్ సరిగా ఉండట్లేదని ఉద్యోగులు చెప్పారు. పనిచేసే చోట వెంటిలేషన్‌‌‌‌ ఎట్లుందని సర్వేలో అడగ్గా.. 36 శాతం మంది బాగుందని తెలిపారు. 39 శాతం మంది మామూలుగా ఉందని, 21 శాతం మంది బాలేదని, 4 శాతం మంది ఏమీ చెప్పలేదు. వెంటిలేషన్ బాగా లేని చోట వైరస్ వ్యాప్తి ఎక్కువుండే చాన్స్ ఉందని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు.