మల్కాజిగిరిలో కటింగ్ చేసే వ్యక్తికి కరోనా

మల్కాజిగిరిలో కటింగ్ చేసే వ్యక్తికి కరోనా

హైదరాబాద్ మల్కాజిగిరిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మల్లికార్జున్ నగర్ కు చెందిన ప్రవీణ్ కు (48) కరోనా వైరస్ సోకింది. మల్లిఖార్జున నగర్ లో  సెలూన్ నిర్వహిస్తున్నాడు ప్రవీణ్. గత మూడు రోజులుగా దగ్గు , జ్వరం తో  బాధపడుతూ నేచర్క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ(సోమవారం) ప్రవీణ్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధాణ అయ్యింది.  ప్రవీణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన భార్య, కుమారుడితో పాటు.. ఇంట్లో అద్దెకు ఉంటున్న బార్యాభర్తలతో పాటు వారి 5 ఏళ్ల  బాబును హోమ్ క్వారంటైన్ చేశారు. అంతేకాదు సెలూన్ లో  అతనితో పాటు పని చేస్తున్న మరో ఇద్దరు… కట్టింగ్ , షేవింగ్ చేయించుకున్న ఐదుగురు వారి వివరాలను వైద్య సిబ్బందికి తెలిపారు. వారిని అధికారులు పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.